హిందువులు ఏడాది మొత్తం పండుగలు జరుపుకుంటూనే ఉంటారు. ఒక్కొక్క పండుగ రోజు ఒక్కొక్క విధి విధానాలను పాటిస్తూ దానధర్మాలు చేస్తూ ఉంటారు. అదే విధంగా హిందువులు జరుపుకునే తిధుల్లో కామద ఏకాదశి తిధి చాలా ముఖ్యమైనది అని చెప్పాలి. ఈ రోజున విష్ణువును పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం, దానధర్మాలు చేయడం వలన పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. కాగా ప్రతి నెల శుక్ల , కృష్ణ పక్ష ఏకాదశి తిధులకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజున ఉపవాసం ఉంటారు.అదే సమయంలో చైత్ర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున లోక రక్షకుడైన విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం వలన ఒక వ్యక్తి అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందట.
అంతేకాకుండా ఈ ఉపవాసం ప్రభావంతో తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం మాత్రమే కాదు వ్యక్తులు తమ రాశి ప్రకారం దానం చేయడం వల్ల ఎప్పటి నుంచో ఆగిపోయి ఇబ్బంది పెడుతున్న పనులు అన్ని పూర్తి అయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇకపై చైత్ర మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిధి ఏప్రిల్ 7న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు రాత్రి 9:12 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిధి ప్రకారం కామద ఏకాదశి ఉపవాసం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం రోజున పాటించబడుతుంది. ఇకపోతే కామద ఏకాదశి రోజున ఏ రాశి వారు ఎలాంటివి దానం చేయాలి అన్న విషయానికి వస్తే..
మేష రాశి వారు కామధ ఏకాదశి రోజున ఎరుపు రంగు స్వీట్లు ఎరుపు రంగు సీజనల్ పండ్లు,కాయ దాన్యాలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందట.
వృషభ రాశి వారు బియ్యం గోధుమలు చక్కెర పాలు వంటి విధానం చేయడం మంచిదట.
ఇక మిధున రాశి వారు ఆవుకు ఆహారాన్ని అందించాలట. ఆపదలో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి ఆహారాన్ని అందించాలని, అవసరమైన వారికి ఆకుపచ్చ కూరగాయలు దానం చేయాలని చెబుతున్నారు.
కర్కాటక రాశి వారు వెన్న,చక్కెర,మిఠాయి, లస్సీ,మజ్జిగ మొదలైనవి ధానం చేయాలని చెబుతున్నారు.
సింహ రాశి వారు కామధ ఏకాదశి రోజున విష్ణు తర్వాత దారిన వెళ్లే వారికి ఎర్రటి పండ్లు షర్బత్ పంచి పెట్టాలని చెబుతున్నారు.
కన్యా రాశి వారు వివాహిత మహిళలకు ఆకుపచ్చ రంగు గాజులను అందించాలని చెబుతున్నారు.
ఇక తులా రాశి వారు విష్ణువును పూజించిన తర్వాత అవసరమైన వారికి తెల్లని బట్టలు దానం చేయాలట.
వృశ్చిక రాశి వారు కందిపప్పు, ఎర్ర మిరపకాయలు ఎరుపు రంగు పండ్లు మొదలైనవి ధానం చేయాలని చెబుతున్నారు.
ఇక ధనస్సు రాశి వారు దారిన వెళ్లే వారికి కుంకుమ పువ్వు కలిపిన పాలను పంచాలట. అంతేకాకుండా పసుపు రంగు పండ్లు ఇతర తిను బండరాలను కూడా దానం చేయవచ్చు అని చెబుతున్నారు.
మకర రాశి వారు శ్రీమహావిష్ణువును పూజించి పేదలకు ధనాన్ని దానం చేయాలని చెబుతున్నారు.
కుంభ రాశి తోలు బూట్లు చెప్పులు గొడుగు నల్లని బట్టలు వంటివి దానం చేయడం మంచిది అని చెబుతున్నారు.
మీన రాశి వారు అరటిపండు శనగపప్పు శనగపిండి పసుపు రంగు బట్టలు దానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.