TTD: కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

  • Written By:
  • Updated On - June 19, 2024 / 11:47 PM IST

TTD: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటుకావంతో తిరుమల తిరుపతిలో పలు మార్పులు జరుగుతున్నాయి. రహదారుల నుంచి భక్తులు వసతుల వరకు ప్రతి అంశంలో కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమలను ప్రక్షాళన చేస్తామని చెప్పడంతో భక్తులతో పాటు ఏపీ ప్రజల కూడా తిరుమల తిరుపతి వైపు ఆసక్తిగా చూస్తున్నారు.