మరో మూడు రోజుల్లో నాగుల చవితి నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో నాగ దేవతకు ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు పుట్టకు అలాగే నాగుల కట్టక పూజలు చేసి పాలు పోసి గుడ్లు, చలిబిడి వంటివి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అయితే
కాలసర్పదోషంతో బాధపడేవారు నాగ పంచమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చట. ఈ రోజు కాలసర్ప దోషాన్ని నయం చేయడానికి ఉత్తమమైన రోజుగా భావిస్తారు. మరి ఈ పండుగ రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శ్రావణ మాసంలో శుక్లపక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. 2024 లో ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాగ పంచమి వస్తుంది. ఈ రోజున పాము దేవుడిని పూజిస్తారు. కాగా శ్రావణ మాసంలో నాగ పంచమిని ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున పాము పూజ చేస్తారు. కాలసర్ప దోషం తొలగిపోవడానికి వివిధ రకాల పూజలు చేస్తుంటారు. కాగా ఒక వ్యక్తి తన కుండలిలో కాలసర్ప దోషం ఉంటే, ఒక జత వెండి పాములను కొనుగోలు చేసి, నాగ పంచమి నాడు పూజ చేసి, వాటిని ప్రవహించే నదిలో వదలాలట.
ఈ విధంగా చేయడం వల్ల కాలసర్ప దోషం తగ్గుతుందట. అలాగే కాల సర్పదోషం తొలగిపోవాలంటే నాగ పంచమి రోజున ఏదైనా శివాలయాన్ని సందర్శించి ఆ రోజు ఆలయాన్ని శుభ్రపరుచుకోవాలని పండితులు చెబుతున్నారు. కాగా ఈ నాగ పంచమి రోజు నాగ దేవతను భక్తి శ్రద్దలతో పూజించడం మంచిదని చెబుతున్నారు.