Site icon HashtagU Telugu

Lord Shiva: ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Lord Shiva

Lord Shiva

మాములుగా ఇంట్లో చాలామంది అనేక మంది దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. కొందరు దేవుళ్ళ ఫొటోలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే శివలింగాన్ని పెట్టుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

అయితే శివ లింగాన్ని పెట్టుకోవడానికి అనుమాన పడుతూ ఉంటారు. శివలింగాన్ని పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలని లేదంటే ప్రమాదాలు జరుగుతాయని అపోహ పడుతూ ఉంటారు. మరి ఈ విషయంలో నిజా నిజాల గురించి మనం తెలుసుకుందాం.. ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకోవచ్చట. కానీ కేవలం బొటన వేలు అంత శివ లింగాన్ని మాత్రమే ఉంచుకోవాలట. అలాగే శివాలయం లేని స్మశానం కూడా ఉండకూడదట. ఎందుకంటె ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయట. అందుకే శివుడి స్మశానంలో సంచరిస్తుంటాడు.

స్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. స్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా? ఎవరు పడితే వారు ఏదో చెబుతూ ఉంటారు. ఎందుకంటె వాళ్ళ అర్థ జ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు. ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి. ప్రతిరోజు మంచి నీటితో అభిషేకం చేయాలట. లేదంటే ఒక కొత్త వస్త్రంలో నీళ్లలో వడకట్టి ఆ నీటితో అభిషేకం చేయాలట.. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితుల్లో ఉంటే అభిషేకం చేయకుండా పరవాలేదు. అభిషేకం చేసేటప్పుడు మహా మృత్యుంజయ మంత్రం చదవాలట. లేదంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చేస్తే సరిపోతుందట.