Site icon HashtagU Telugu

Mirror: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిశలో అద్దం ఉంటే చాలు.. అదృష్టం కలిసి రావడంతో పాటు ధనవంతులవ్వడం ఖాయం!

Mirror

Mirror

వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులు మనం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు కారణం కావచ్చు అని చెబుతున్నారు పండితులు. మన ఇంట్లోని వస్తువులు సరైన దిశలో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే అద్దం సరైన దిశలో ఉంటే ధనవంతులు అవ్వడం ఖాయం అని అదృష్టం కూడా బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు.. ఇంతకీ వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశలో ఉండాలి దాని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మన ఇంట్లో అద్దం కూడా సరైన దిశలో పెట్టుకోవడం ఎంతో అవసరం ఇలా ఇంట్లో అద్దం సరైన దిశలో ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందట. కాగా మన ఇంట్లో అద్దం ఎల్లప్పుడూ కూడా బయటనుంచి వచ్చే వెలుగు ఇంట్లో ప్రసారమయ్యే విధంగా ఉండాలని చెబుతున్నారు. అంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే అద్దం కనిపించేలా ఎప్పుడు పెట్టకూడదట. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ అలాగే తిరిగి వెళ్ళిపోతుందని, అదేవిధంగా ఇంట్లో హాల్లో అద్దం అమర్చడం వల్ల వచ్చిన వారి చూపు మన ఇంటిపై పడకుండా అద్దంపై పడటంతో ఇంటిలో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఏర్పడకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని చెబుతున్నారు.

మనం అద్దం అమర్చినప్పుడు ఆ అద్దంలో పొరపాటున కూడా చెత్త కనిపించేలా అమర్చకూడదట. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయట. ఇక డైనింగ్ టేబుల్ ఎదురుగా కూడా అద్దం ఉండటం వాస్తు ప్రకారం మంచిదట. ఇక పడక గదిలో మన బెడ్ కనిపించేలా అద్దం అమర్చకూడదట. ఇలాంటి ప్రదేశాలలో అద్దం లేకుండా చూసుకున్నప్పుడు మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో అద్దం సరైన దిశలో లేకపోతే వేంటనే అద్దంని సరైన దిశలో ఉంచుకోండి లేదంటే లేని పోనీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు మానసికపరమైన ఇబ్బందులు కూడా వస్తాయని చెబుతున్నారు.