Site icon HashtagU Telugu

Tulsi Water : తులసి నీటితో ఇలా చేస్తే చాలు.. మీ సమస్యలన్నీ మాయం అవ్వాల్సిందే..

Just Do This With Tulsi Water.. All Your Problems Should Disappear..

Just Do This With Tulsi Water.. All Your Problems Should Disappear..

Tulsi Water : హిందూ ధర్మంలో తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతోపాటు ఇంటి ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. తులసి (Tulsi) మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తులసి దేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. తులసి మొక్కను ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో ఉంచాలి. దీని ద్వారా భగవంతుని అనుగ్రహం మనపై ఉంటుంది.

We’re Now on WhatsApp. Click to Join.

దీనితో పాటు ఉదయాన్నే తులసి (Tulsi) మొక్కకు నీరు సమర్పించడం వల్ల విష్ణువు ప్రసన్నుడవుతాడు. సాయంత్రం వేళ తులసి మొక్క వ‌ద్ద‌ నేతితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆ ఇంటి సభ్యులపై శ్రీ‌మ‌హా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. తులసి (Tulsi) ద‌ళాల‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ అనంతరం ఇల్లంతా చిలకరించాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది ఇంట్లో ఉన్న ప్ర‌తికూల శ‌క్తిని నాశనం చేసి అక్కడ సానుకూల కిరణాలు వెదజల్లుతుంది. అలాగే తులసి ద‌ళాల‌ను నీటిలో మూడు రోజులు నానబెట్టి, ఉదయం, సాయంత్రం పూజ తర్వాత ఈ నీటిని మీ కార్యాల‌యం, దుకాణం లేదా ఫ్యాక్టరీలో చల్లితే అక్కడున్న నెగిటివ్ శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది.

మీ ఆర్థిక‌ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. అలాగే పని ప్రదేశంలో మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. తులసి దళం శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి, శ్రీకృష్ణుని బాల రూపమైన బాల కృష్ణునికి తులసి జలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయ‌డం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. బాల గోపాలునికి తులసి ద‌ళాల‌ నీటితో అభిషేకం చేయడం ద్వారా, మీరు ఆయ‌న‌ విశేష అనుగ్రహాన్ని పొందుతారు. మీరు బాల‌కృష్ణుడిని తులసి నీటితో అభిషేకించిన తర్వాత, మీరు తులసి ద‌ళాల‌తో మాల సమర్పించి సాధారణ పూజ చేయవచ్చు.

ఇంట్లో ఎవరికైనా ఎక్కువ కాలం అనారోగ్యంగా ఉంటే వారిపై తులసి నీళ్లు చల్లాలి. దీంతో వ్యాధి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. తులసిలో ఉండే ఔషధ గుణాల వల్ల అనారోగ్యం తగ్గుతుంది. తుల‌సి నీరు వ్యాధుల‌ను అరిక‌డుతుంది.

Also Read:  Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి షాక్.. ఇకపై వాటికి డబ్బులు చెల్లించాల్సిందే?