Srivari Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల (Srivari Arjita Seva Tickets) చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
మార్చి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
మార్చి 21న జ్యేష్టాభిషేకం టికెట్లు
జూన్ 09 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
మార్చి 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Also Read: Telangana RTC: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.. లింక్‌తో నమోదు చేసుకోండిలా!
మార్చి 22న అంగప్రదక్షిణం టోకెన్లు
జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల
తిరుమల, తిరుపతిలలో జూన్ నెల గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
ముఖ్యమైన తేదీలు
- రేపు ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్
- తిరిగి 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ
- మార్చి 21 తేదీన ఉదయం 10 గంటలకు మరిన్ని ఆర్జిత సేవలు విడుదల
- మార్చి 21 తేదీన ఉదయం 11 గంటలకు జ్యేష్ఠాభిషేకం టికెట్లు విడుదల
- మార్చి 21 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు విడుదల
- మార్చి 22 తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల
- మార్చి 22 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల
- మార్చి 22 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు,దివ్యాంగుల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ
- మార్చి 24 తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల
- మార్చి 24 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వసతి సముదాయాల కోటా విడుదల