Jiji Bai Ka Mandir: ఇదేం వింత ఆచారం.. వింత‌గా ఉందే..!

మ‌న దేశంలో వింత ఆచారాలు పాటిస్తుంటారు కొన్ని ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు. అయితే ఆ వింత ఆచారాలు వారి పూర్వీకుల నుంచి వ‌స్తుంటాయ‌ని వారు పాటిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - October 15, 2022 / 06:45 AM IST

మ‌న దేశంలో వింత ఆచారాలు పాటిస్తుంటారు కొన్ని ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు. అయితే ఆ వింత ఆచారాలు వారి పూర్వీకుల నుంచి వ‌స్తుంటాయ‌ని వారు పాటిస్తుంటారు. అయితే ఇలాంటి వింత ఆచారాలు మ‌న దేశంలో చాలా ఉన్నాయే. వాటిలో ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే వింత ఆచారం మీకు మ‌రీ వింత‌గా అనిపిస్తోంది. ఆ వింత ఆచారం ఎక్క‌డ జ‌రుపుకుంటారు.. ఎందుకు జ‌రుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కోలా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఓ వింత ఆచారం ఉంది. మ‌న దేశంలోనే కాదు.. ఏ దేశంలోనైనా ఏదైనా టెంపుల్‌కు వెళ్తే మ‌న కాళ్ల‌కు ఉన్న చెప్పులు బ‌య‌ట విడిచి వెళ్తాం. కానీ భోపాల్‌లోని కోలా ప్రాంతంలో అలా చేయ‌రంటా. కోలా ప్రాంతంలోని జిజిబాయ్ ఆల‌యం లేదా ప‌హ‌డా వాలీ మాతా మందిరానికి వెళ్లిన భ‌క్తులు స్వ‌యంగా చెప్పులు లేదా బూట్లు స‌మ‌ర్పిస్తారంటా. అయితే ఇలా చెప్పులు లేదా బూట్లు ఎందుకు ఇస్తారంటే.. అక్క‌డ అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తార‌నేది అక్క‌డి భ‌క్తుల విశ్వాసం. అంతేకాకుండా బూట్లు, చెప్పులు ఇస్తే అమ్మ‌వారి చూపు వారిపై ఉంటుంద‌ని న‌మ్ముతారు.

అయితే అక్క‌డి ఆల‌యంలోని అమ్మ‌వారిని భ‌క్తులు కుమార్తెగా భావిస్తారంటా. అందుకే చెప్పులు, బూట్ల‌తోపాటు టోపీ, క‌ళ్ల‌ద్దాలు, వాచీ, మొద‌లైన‌వి స‌మ‌ర్పిస్తార‌ని అక్క‌డి పూజ‌రులు తెలిపారు. అయితే విదేశాల నుంచి సైతం భ‌క్తులు అమ్మ‌వారికి చెప్పులు, వివిధ వ‌స్తువులు పంపిస్తార‌ని తెలిపారు. అయితే.. ఈ సారి అమ్మ‌వారి న‌వ‌రాత్రు స‌మ‌యంలో సింగపూర్‌, ప్యారిస్‌, జర్మనీ, అమెరికా దేశాల్లోని మ‌న‌ భక్తుల నుంచి అమ్మవారికి చెప్పులు అందాయని తెలిపారు.