Pasupu Kumkuma : పసుపు, కుంకుమలు కిందపడితే అపశకునమా..?

పసుపు, కుంకుమలను శుభసూచికగా పరిగణిస్తుంటాం. ముత్తైదువలు పసుపు, కుంకుమను శుభప్రదంగా భావిస్తుంటారు. శుభాకార్యాల్లో ఎక్కువగా వాడుతుంటారు. సుమంగళీకి గుర్తులు ఈ రెండూ.

Published By: HashtagU Telugu Desk
Pasupu And Kunkum

Pasupu And Kunkum

పసుపు, కుంకుమలను శుభసూచికగా పరిగణిస్తుంటాం. ముత్తైదువలు పసుపు, కుంకుమను శుభప్రదంగా భావిస్తుంటారు. శుభాకార్యాల్లో ఎక్కువగా వాడుతుంటారు. సుమంగళీకి గుర్తులు ఈ రెండూ. భారతీయ సంప్రదాయంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటికి అతిథులు వస్తే ఏం ఇచ్చిన…ఇవ్వకపోయినా..పసుపు, కుంకుమలను పెట్టి పంపిస్తుంటారు. ఎంతో పవిత్రంగా పసుపు, కుంకుమలను భావిస్తుంటారు. ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు కూడా బొట్టు పెట్టి పిలుస్తుంటారు. పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపు కుంకుమను సారెగా పంపిస్తుంటారు.

ఈ విధంగా ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకమ పొరపాటున చేజారిపడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలైతుంది. అదో అపశకునంగా భావిస్తారు. ఏదో చెడు జరుగబోతోందని మదనపడుతుంటారు. అయితే శాస్త్రీయంగా అలాంటివి లేదని పెద్దలు అంటున్నారు. అది కేవలం అపోహమాత్రమే అని చెబుతున్నారు పండితులు.

పసుపు, కుంకమ కిందపడితే ఏం చేయాలి.

ఒకవేళ అనుకోకుండా కుంకుమ చేజారి కిందపడితే…అలా పడినచోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి. మంగళ, శుక్రవారాల్లో కుంకుమ కిందపడిందంటే..చాలా బాధపడుతుంటారు. కానీ అస్సలు బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు జ్యోతిశ్యశాస్త్ర పండితులు. ఆ రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువుకు బొట్టుపెట్టి పంపించాలి. ఏదైనా పూజ, వ్రతం చేస్తున్నప్పుడు కుంకుమ, పసుపు చేజారిపడినా అది ఎంతమాత్రం అపశకునం కాదు. కిందపడితే ఎలాంటి అశుభం కాదట..అస్సలు చింతించకండి.

 

  Last Updated: 26 Jun 2022, 07:36 AM IST