Know These With Date Of Birth: పుట్టిన తేదీని బట్టి మీ ఇంట్లో ఇవి తప్పనిసరిగా ఉంచుకోవాలి. అవేంటంటే..!

సాధారణంగా పుట్టిన తేదీని బట్టి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా ఇస్టాఇష్టాలను కూడా తెలుసుకోవచ్చట. అదేవిధంగా

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 01:00 PM IST

సాధారణంగా పుట్టిన తేదీని బట్టి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా ఇస్టా అఇష్టాలను కూడా తెలుసుకోవచ్చట. అదేవిధంగా మనం పుట్టిన తేదీని బట్టి రంగులు, అదృష్ట సంఖ్యలు అదేవిధంగా ఎటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుంది అన్న విషయాలను కూడా పురాతన గ్రంథాలలో చెబుతూ ఉంటారు. మరి ఏ తేదీలలో పుట్టిన వారు ఎటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ శుభాలు జరుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1వ తేదీన జన్మించిన వారు ఇంటిలో ఉత్తర దిశలో వెదురుతో తయారు చేసినటువంటి వేణువు ఉంచడం మంచిది. అదేవిధంగా రెండవ తేదీ జన్మించిన వారు వాయువ్య దిశలో తెలుపు రంగు గవ్వలతో తయారుచేసిన బొమ్మను పెట్టుకోవడం మంచిది. ఇక మూడవ తేదీ జన్మించిన వారు ఇంటిలో రుద్రాక్ష మాలను ఈశాన్య దిశలో పెట్టడం మంచిది. ఇక నాలుగో తేదీ జన్మించిన వారు ఇంటిలో నైరుతి దిశలో అద్దం దీర్ఘచతురస్రాకారంలో చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవడం మంచిది. ఒకవేళ ఈ అద్దం ముక్కలు కనుక చెల్లాచెదురుగా ఉన్నట్టు అయితే ఇంట్లోని కుటుంబ సభ్యులకు కీడు జరిగే ప్రమాదం సంభవిస్తుంది. ఐదవ తేదీ జన్మించిన వారు ఇంటిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా కుబేరుడు విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టుకోవాలి. ఆరవ తేదీ జన్మించిన వారు నెమలి పించాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం ఎంతో మంచిది. అదేవిధంగా ఏడవ తేదీ జన్మించిన వారు ఆగ్నేయ దిశలో రుద్రాక్షను ఉంచడం ఎంతో మంచిది. ఆ రుద్రాక్షలు ముదురు రంగులో ఉండాలి.

ఇక ఎనిమిదవ తేదీ జన్మించిన వారు నలుపు రంగు క్రిస్టల్స్ ని దక్షిణ దిశలో పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇక తొమ్మిదవ తేదీ పుట్టిన వారు పిరమిడ్ ను దక్షిణ దిశలో పెట్టుకోవడం మంచిది. ఇక 11వ తేదీ వారు రెండో తేదీలో జన్మించిన వారు ఈ వస్తువులను పెట్టుకుంటారో అదే వస్తువులను పెట్టుకోవడం వల్ల ఎంతో మంచిది. అలాగే 12వ తేదీ జన్మించిన వారు మూడో తేదీ జన్మించిన వారు ఎటువంటి వస్తువులను ఉపయోగిస్తారో అటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం మంచిది.