Parameshwara : పరమేశ్వరుడిని సోమవారం రోజు ఇలా పూజిస్తే చాలు.. ఐశ్వర్యవంతులు అవ్వాల్సిందే?

ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు (Parameshwara). సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

Published By: HashtagU Telugu Desk
It Is Enough To Worship Lord Parameshwar On Monday.. And Become Wealthy..

It Is Enough To Worship Lord Parameshwar On Monday.. And Become Wealthy..

Worship Lord Parameshwara on Monday : హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. పరమేశ్వరుడికి సోమవారం ప్రీతికరమైన రోజు. ఆ రోజున పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అయితే పరమేశ్వరుని (Parameshwara) భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలట ఆయన అనుగ్రహం కలగడంతో పాటు భక్తులను తొందరగా దీవిస్తాడని వారి కోరికలను నెరవేరుస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరి సోమవారం రోజు పరమేశ్వరున్ని ఏ విధంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు (Parameshwara). సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మనకున్న దారిద్ర్య బాధలు, ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలు పోవాలంటే శివుడిని సోమవారం రోజు ప్రత్యేకంగా ఆరాధించాలి. ఇందుకోసం సోమవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. శివలింగానికి మంచి నీటితో అభిషేకం చేయాలి. తర్వాత విభూదిని సమర్పిచి,ఆ విభూతిని నుదిటిన ధరించాలి. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. తెల్ల లేదా ఎర్రగన్నేరు, తుమ్మి పూలు,మోదుగ పూలు, తెల్లజిల్లేడు పూలు శ్రేష్టమైనవి.

తరువాత శివ అష్టోత్తరం చదువుతూ సాయంత్రం వరకు ఉపవాసము ఉండి శివాలయానికి వెళ్లి లేదా ఇంట్లోనైనా శివుడి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి. సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం (పెరుగన్నం) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే మనసు శివుడి మీద పెడితేనే శివానుగ్రహం లభిస్తుందన్న విషయం మరచిపోవద్దు. శివ స్తోత్రాలు, శివపంచాక్షరీని నిరంతరం జపించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. ఇలా కొన్ని వారాల పాటు వ్రతంగా భావించి పైన చెప్పిన విధంగా శివపూజ చేస్తే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

Also Read:  Wonder Bike 250 : ఇదిగో వండర్ బైక్.. రూ.8కే 30 కి.మీ మైలేజీ

  Last Updated: 09 Dec 2023, 05:27 PM IST