Ganapati Idol : ఇంట్లో ఆ గణపతి విగ్రహం ఉంటే చాలు.. వాస్తు దోషాలు తొలగిపోవాల్సిందే?

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందుగా విగ్నేశ్వరుని (Ganapati) పూజించి ఆ తర్వాతనే అసలు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 05:40 PM IST

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందుగా విగ్నేశ్వరుని (Ganapati) పూజించి ఆ తర్వాతనే అసలు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అలాగే దేవతామూర్తులలో కూడా మొదటి పూజా గణపతికి చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తుంది. విఘ్నేశ్వరుడికి మొదటి పూజ చేయడం వల్ల కష్టాలను తీర్చడంతోపాటు మనం మొదలుపెట్టే పని ఇటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని వేడుకుంటూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే విఘ్నేశ్వరుడు ఇంట్లోని వాస్తు దోషాలను కూడా తొలగిస్తాడని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు.

We’re Now on WhatsApp. Click to Join.

అందుకే ఇంట్లో హాస్పిటల్ లో ఆఫీసులలో చాలామంది గణపతి విగ్రహాలను (Ganapati Idols) పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే మరి ఇంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి గణపతి ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ లో లేదంటే అక్కడ ఉన్న టేబుల్స్ పై పసుపు లేదా ఆకుపచ్చ గణపతిని విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది. అలాగే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలు ఉంచకూడదు. పూజ గదిలో పసుపు గణపతిని పూజించడం చాలా మంచిది. ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే, తెల్లటి గణ‌ప‌తి విగ్రహాన్ని డబ్బు భ‌ద్ర‌ప‌రిచే ప్రదేశంలో ఉంచాలి.

ఇంట్లో గణ‌ప‌తి విగ్రహాన్ని ప్రతిష్టించడం, వ్యాపార స్థలంలో వినాయకుడిని ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఇంటి ప్రధాన ముఖ ద్వారం లోపల వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ప్రతి ఉదయం పూజ చేసి అర్ఘ్యం సమర్పించాలి. అలా అని పడకగదిలో గణ‌ప‌తి విగ్రహం, ఫోటో పెట్టకూడదు. ఇంటి ఈశాన్య దిక్కులో వినాయ‌క విగ్ర‌హం ప్రతిష్టించడం అత్యంత శ్రేయస్కరం. ఇంట్లో ఈశాన్య మూల పూజకు ఉత్తమమైనది. మీరు ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో వినాయకుడిని ఉంచవచ్చు. విగ్రహాన్ని ఉంచేటప్పుడు, ఆయ‌న‌ రెండు పాదాలు నేలను తాకేలా చూసుకోవాలి. విగ్రహాన్ని ఇలా ఉంచితే విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. అలాగే ఇంట్లో దక్షిణం వైపు వినాయకుడిని పెట్టకూడదు. అలాగే ఇంట్లో కేవలం ఒక గణపతి విగ్రహాన్ని మాత్రమే పెట్టి పూజించాలి.

పూజా మందిరంలో మూడు వినాయక విగ్రహాలను కలిపి ఉంచవద్దు. తొండం ఎడమవైపున‌కు తిరిగిన వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. విగ్రహం ఎత్తు పన్నెండు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే ఎక్కువగా పసుపు కలర్ ఉండే గణపతిని పూజించడం చాలా మంచిది.

Also Read:  Bhagavan Sri Sathya Sai Baba : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చరిత్ర..