ISRO: ఉత్తరప్రదేశ్‌లో జరిగే మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతుంది. 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో దాదాపు 40 కోట్ల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. ఇందు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేసింది. టెంట్ సిటీని నిర్మించి భక్తులకు వసతి సదుపాయం కల్పించింది. సాధువుల నుంచి సామాన్యుల దాకా టెంట్లలో ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి కొన్ని చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు ఇస్రో చేసింది. ఇందులో భారతదేశ పటం కనిపించడం విశేషం.
మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, చేసిన తర్వాత తీసిన ఫొటోలను ఇస్రో షేర్ చేసింది. గతేడాది ఏప్రిల్ లో ఈ ఏరియా నిర్మానుష్యంగా, బీడు భూములను తలపించేలా కనిపించింది. డిసెంబర్ 22న తీసిన ఫొటోలలో ఈ ప్రాంతంలో నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి. టెంట్ల నిర్మాణం గత డిసెంబర్ లోనే మొదలైంది. తాత్కాలికంగా శివాలయ పార్కును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భారతదేశ పటం కనిపించడం విశేషం. ఈ నెల 10న తీసిన ఫొటోలలో మహాకుంభ్ నగర్ లో నిర్మాణాలు భారీగా పెరిగిపోవడం చూడొచ్చు.
కాగా, మహా కుంభమేళా సంక్రాంతి రోజున ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ఈ మహా కుంభమేళా ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఇక మహా కుంభమేళాలలో హెల్త్‌కేర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రిని సెటప్ చేశారు. రెండు 20 పడకల సబ్ సెంటర్ ఆస్పత్రులను, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కుంభమేళా ప్రాంతంలో 125 అంబులెన్సులు అందుబాటో ఉంటాయి. సుమారు లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. లక్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేసన్ వర్కర్లు పనిచేయనున్నారు. 1250 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు.
Read Also: Donald Trump : అమెరికా నుంచి 18,000 మంది వెనక్కి – భారత్ నిర్ణయం