Site icon HashtagU Telugu

Ram Mandir: అయోధ్యలో ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

Ram Mandir

Ram Mandir

Ram Mandir: అయోధ్య రామ మందిరం అనేది కోట్లాది భారతీయ హిందువుల కల. ఐదు దశాబ్దాలుగా దీని కోసం పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ప్రధాని మోడీ హయాంలో అయోధ్యలో రాముడు కొలువు తీరాడు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 7 వేల మంది అతిథులు ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మందిరాన్ని 2500 సంవత్సరాలు చెదరకుండా పటిష్టంగా నిర్మించారు. మందిరాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకోనున్నారు.ఈ నేపథ్యంలో మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రయివేట్ ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకుని ఉపయోగించారు. కాగా సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. అందులో భాగంగానే ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.యాంటీ డ్రోన్ సిస్టమ్ ను సొంతంగా ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలు యాంటీ డ్రోన్ సిస్టమ్ ను పరిశీలించి ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్ సిస్టమ్ అని భావించి కొనుగోలు చేశారు. వీటిని త్వరలో నే అయోధ్య రాముల వారి ఆలయయం వద్ద భద్రత కు ఉపయోగిస్తామని చెబుతున్నారు.

ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని మొదట ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కొనుగోలు చేశారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తించడం తో పాటు ఆ పరిధిలో శత్రువుకు చెందిన డ్రోన్లను నిర్వీర్యం చేస్తాయి. యాంటీ డ్రోన్ల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి, వేగంగా నిర్ణయం తీసుకునేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది.

Also Read: Bandi Sanjay: బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలి: బండి సంజయ్

Exit mobile version