Pot Tips : చేతిలో డబ్బు నిలవడం లేదా..? అయితే మట్టి కలశం తో ఇలా చేయాల్సిందే..

మట్టి కుండ (Earthen Pot) తీసుకొని అందులో రూపాయి నాణాలు 5 ఉంచాలి. వాటితో పాటుగా బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి.

Published By: HashtagU Telugu Desk
Is There No Money In Hand.. But This Has To Be Done With Earthen Pot.

Is There No Money In Hand.. But This Has To Be Done With Earthen Pot.

Pot Tips for Money Staying in Hand : మామూలుగా ప్రతి ఒక్కరూ కష్టపడి డబ్బు సంపాదించి జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలక అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవు. అయితే అలా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే మట్టి కలశంతో (Earthen Pot) పరిహారం పాటించాలి అంటున్నారు పండితులు. మరి మట్టి కలశంతో (Earthen Pot) ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా ఒక చిన్న మట్టి కుండ (Earthen Pot) తీసుకొని అందులో రూపాయి నాణాలు 5 ఉంచాలి. వాటితో పాటుగా బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి. ఈ కలశాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసెయ్యాలి. ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి. పూజ తర్వాత ఈ కలశాన్ని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరం అయ్యి చేతిలో డబ్బులు మిగులుతాయి. సంపాధన కూడా పెరుగుతుంది. అయితే చేతిలో డబ్బులు మిగిలాలంటే ఇంకా కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని దారంతో కట్టాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజ లో ఉంచి పూజ చెయ్యాలి. ఆతర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. శుక్రవారం లక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేసుకుని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి. గులాబి పువ్వులు, గులాబి మాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా వరుసగా 11 శుక్రవారాల పాటు క్రమంతప్పకుండా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు.

Also Read:  Thursday Remedies: గురువారం రోజున పసుపును ఇలా ఉపయోగిస్తే చాలు.. డబ్బే డబ్బు!

  Last Updated: 20 Dec 2023, 04:56 PM IST