హిందూమతంలో ప్రతిదేవతలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉండేలా పూజ చేయడానికి చాలామంది తమ ఇళ్లలోని పూజాగదిలో వివిధ దేవుళ్ల విగ్రహాలను పెట్టుకుంటారు. వాస్తుశాస్త్రంప్రకారం పూజాగదిలోని విగ్రహాన్ని ఉంచే సరైన దిశ, ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో దేవుని విగ్రహాన్ని తప్పుడు దిశలో పెడితే ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. దీంతోపాటు ఆరాధన కూడా అసంపూర్ణంగా పరిగణిస్తారు. వాస్తుప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం.
విఘ్నేశ్వరుడిని ఈ దిశలో ఉంచండి.
ప్రతిశుభకార్యాన్ని ప్రారంభించే ముందు గణేశుడిని మొదట పూజిస్తారు. వినాయకుడి విగ్రహం కచ్చితంగా ఇంట్లోని పూజగదిలోనే ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం పూజగది ఈ శాన్యదిశలో వినాయకుని విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాదు గుడిలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచితే ముందుభాగంలోనే పెట్టడం మంచిదని భావిస్తార.
లక్ష్మీదేవిని కుడివైపున ఉంచండి.
లక్ష్మీదేవి చిత్రం కచ్చితంగా గణేశుడితోపాటు పెడతారు. మీ పూజాగదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచినట్లయితే..వాస్తుప్రకారం ఆమె స్థానం వినాయకుడికి కుడివైపున ఉంటుంది. కొంతమంది ఎడమవైపు గణేశుడితో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచుతారు. కానీ లక్ష్మీదేవి వినాయకుని తల్లి అని చెబుతారు. కాబట్టి వాటిని కుడివైపు మాత్రమే ఉంచాలి.
శివలింగం ఏ దిశలో ఉండాలి.
కొంతమంది తమ ఇంట్లోని పూజాగదిలో శివలింగాన్ని ఉంచి పూజిస్తారు. అలాంటి పరిస్థితిలో శివలింగం సరైన దిశ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తుశాస్త్రం ప్రకారం శివలింగం ముఖం ఉత్తరం వైపు ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.