కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాటు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మనుషుల జీవనశైలిలో వచ్చిన అనేక అలవాట్లు వారి ఆర్థిక ఇబ్బందులకు మానసిక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. అటువంటి వాటిలో చాలామంది ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం కూడా ఒకటి. ఒకప్పుడు చెప్పులను ఇంటి బయట వదిలి గుమ్మం లోపలికి వచ్చేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో కొందరు బాగా డబ్బు ఉన్న వారు చెప్పులు నేరుగా ఇంట్లోకి వేసుకొని వెళ్లడం అలాగే ఇంట్లో వేసుకోవడానికి వాష్రూమ్లో వేసుకోవడానికి రకరకాల చెప్పులు వినియోగించడం లాంటివి చేస్తుంటారు.
ఇలా చాలామందికి బాత్రూం లోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్లే అలవాటు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్పెషల్గా బాత్రూం చెప్పల్స్ అని కూడా ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి స్నానం చేసేటప్పుడు కూడా చెప్పులు వేసుకోవడం మంచిదేనా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. స్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా చెప్పులు వేసుకోకూడదట. ఎందుకంటే మనం స్నానం చేసేటప్పడు మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ నీటితో పోతుందట. అలాంటప్పుడు మనం కాళ్లకు చెప్పులు వేసుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోకుండా ఆగిపోతుందట.
అంతేకాదు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోవడం మొదలు పెడుతుందట. దీని వల్ల స్నానం చేసినా మన శరీరం పవిత్రంగా, పవిత్రంగా మారదు అంటున్నారు పండితులు. మనం చెప్పులు లేకుండా స్నానం చేస్తే, మనకు భూమి నుండి దైవిక శక్తి లభిస్తుందని శారీరక అనారోగ్యం నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు పండితులు. అయితే మనం చెప్పులు ధరించి స్నానం చేస్తే, భూమి నుండి మనకు శక్తి లభించదట. స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించకూడదు అనడానికి మరో కారణం కూడా ఉంది. బూట్లు, చెప్పులు శని గ్రహానికి సంబంధించినవిగా నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో, స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించడం వల్ల జాతకంలో శని స్థానం బలహీనపడుతుందని నమ్ముతారు.