Site icon HashtagU Telugu

Shivarathri 2022 : శివరాత్రి నాడు శివుడికి పూజ చేయక్కర్లేదా…? ఉపవాసమొక్కటే చాలా?

Lord Siva

Lord Siva

హిందువులకు మహాశివరాత్రి ఎంతో పవిత్రమైంది. పుణ్యప్రదమైంది. శివరాత్రి పర్వదినం అంటే భోళాశంకరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. శివరాత్రినాడు ఆ దేవదేవుడి అనుగ్రహం కోసం…భక్తులు ఉపవాసాలు, జాగరణ, బిల్వార్చన, శివనామస్మరణతో నిష్టగా పూజలు నిర్వహిస్తుంటారు.శివుడు అంటే శుభప్రదం, మంగళకరమనే అర్థం వస్తుంది. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అనే అర్థం. అయితే రాత్రి అంటే అజ్ఞానానికి సంకేతంగా భావిస్తుంటారు. అలాంటిది రాత్రి మంగళకరమైంది ఎలా అవుతుందన్న డౌన్ చాలా మందికి వస్తుంది. అయితే శివరాత్రిన భక్తులు ఉపవాసం, జాగరన చేయడం, బిల్వార్చన, అభిషేకం, శివనామస్మరణతో చీకటి తెరలు తెంచుకుని అంతా జ్జాన వెలుగు ప్రసరిస్తాయని పురాణాల్లో ఉంది.

 

ఇక పురాణాల ప్రకారం చూసినట్లయితే…పరమేశ్వరుడిని శివరాత్రి గురించి పార్వతిదేవీ అడిగినప్పుడు…శివుడు ఇలా చెప్పాడట. మహాశివరాత్రి తనకు ఎంతో ప్రీతిపాత్రమైందని…ఆరోజు భక్తులు ఏం చేయకున్నా…ఒక్క ఉపవాసముంటే చాలు…నేను చాలా సంతోషిస్తా అని చెప్పాడట. పురాణాల ప్రకారం శివరాత్రి రోజున భక్తులు నిష్టంగా ఉపవాసం ఉంటారు. అలాగే రాత్రి నాలుగు జాముల్లో శివలింగానికి భక్తితో అభిషేకం నిర్వహిస్తే చాలా మంచిదట.అభిషేకం నిర్వహించే ముందు పాలు, ఆ తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకిస్తే… ఆ పరమేశ్వరుడికి ఎంతో సంతోషం కలుగుతుందట. ఒక తర్వాత రోజు నిష్టగా దేవుడికి నైవేద్యం సమర్పించి శివరాత్రి ఉపవాసాన్ని పూర్తి చేయాలి. దీన్ని మించిన పూజలు, వ్రతాలు ఏవీ కూడా అవసరంలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓంకార స్వరూపంగా కొలువుదీరిన పరమేశ్వరుడు…కోరిన కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే మొక్కులు మొక్కకుని ఆ భోళాశంకరుడిని దర్శించుకోవడానికి ఆలయాలకు వెళ్తుంటారు. మిగతా రోజుల కంటే ఈ శివరాత్రి రోజు చాలా పవిత్రమైంది. ఈ రోజున శివుడి అనుగ్రహం పొందాలంటే ఎంతో నిష్టగా ఈ దేవుడికి పూజలు నిర్వహించి…ఉపవాసం, జాగరణ చేయాలి.

Exit mobile version