Site icon HashtagU Telugu

Crow At Home: ఇంటి ముందు కాకి అరవడం మంచిదేనా.. అది దేనికి సంకేతమో తెలుసా?

Crow At Home

Crow At Home

హిందూ సంప్రదాయంలో హిందువులు కొన్ని రకాల పక్షులకు, జంతువులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వాటి యొక్క ప్రవర్తనాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో కాకులు కూడా ఒకటి. కాకులు కొంతమంది మంచివి అని భావిస్తే మరి కొంతమంది కాకులు మంచిది కాదని అవి ఏంటి సమీపంలోకి రాగానే వాటి తరిమేస్తూ ఉంటారు. కాకులను అశుభంగా భావిస్తుంటారు. అయితే ఒకవేళ అలాంటి కాకి ఇంటి ముందు వచ్చి అరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాకులు పదేపదే ఇంటి ముందు వచ్చి అరిస్తే మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు.

అలా అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని కొంతమంది అంటే మరి కొంతమంది గొడవలు జరుగుతాయని అంటూ ఉంటారు. అయితే సూర్యోదయం సమయంలో కాకులు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటే అది శుభప్రదంగా భావించారట. ఇలా అరిస్తే మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందని అర్థం అంటున్నారు. అదేవిధంగా ఇంటి ఆవరణలో లేదా ఇంటిపై కాకులు అరిస్తే ఇంటికి ఎవరో అతిధి రాబోతున్నారని అర్ధమట. అతిథులు ఇంటికి రావడం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తారు.

అయితే కాకి ఇంటి ముందుకు అకస్మాత్తుగా వచ్చి పదే పదే గట్టిగా అరుస్తే అది సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు. అంతే కాకుండా కాకులు వచ్చి పదే పదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలకు కూడా సంకేతంగా భావిస్తారు. దీని వలన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు పెరగచ్చని శకున శాస్త్రం చెబుతోంది. కాబట్టి కాకులు అరవడం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ పదేపదే అరవడం అంత మంచిది కాదని చెబుతున్నారు.