Site icon HashtagU Telugu

Navagrahas Pooja: నవగ్రహాలను దర్శించుకున్నాక…కాళ్లు కడుక్కోవాలా?వద్దా..?

Navagrahas

Navagrahas

నవగ్రహ పూజ గురించి చాలామందికి చాలారకాల సందేహాలు ఉంటాయి. నవగ్రహ పూజా ఫలితం దక్కాలంటే పూజ విధివిధానాలను పక్కాగా పాటించాలి. అనేక మందికి ఉన్న సందేహాల్లో ముఖ్యమైంది…నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కోవాలా…వద్దా…కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి…ఇలాంటి సందేహం ఉంటుంది.

అయితే నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రంలోనూ…లేదట…అలాగే ఏ ధర్మంలోనూ చెప్పలేదట. నవగ్రహాల పూజ చేసి..అక్కడే కాళ్ల కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది అంటుంటారు. కానీ అవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే ఏ గుడికి వెళ్లేముందు…ముందే కాళ్లు కడుక్కుంటాం. గుడి నుంచి బయటకు వచ్చాక కడుక్కోం. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే స్నానం ఆచరించి మంచి వస్త్రాలను ధరించి గుడికి వెళ్తుంటాం.

ఒకవేళ నవగ్రహాల గుడికి వెళ్లాలనుకున్నప్పుడు..ముందు నవగ్రహాల పూజ చేయాలి. ఆ తర్వాత ప్రధాన గుడిని దర్శించుకోవాలి. లేదంటే ముందు ప్రధాన గుడిని దర్శించుకున్న తర్వాత నవగ్రహాల పూజ చేసుకుని ఇంటికి రావాలి. అంతేకానీ కాళ్లు కడుక్కోవడం అనేది ఎక్కడా ప్రస్తావించలేదు.

ఇక ఇంటి నుంచి గుడి దూరంగా ఉన్నట్లయితే..కాళ్లకు దుమ్మూధూళి అంటుకుంటే.అప్పుడు గుళ్లోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవాలి. నవగ్రహ పూజ కూడా దేవుడి పూజ సమానం కాబట్టి…పూజ తర్వాత కాళ్లు కడుక్కోకూడదు. అది సరైన పద్దతి కాదు. పూజ తర్వాత నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఎక్కడికీ వెళ్లొద్దు..ఎవరింటికీ వెళ్లకూడదు.