Site icon HashtagU Telugu

Hindu Wedding: పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా?

Maxresdefault (2)

Maxresdefault (2)

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. పెళ్లి పనులలో పెళ్ళికొడుకుని చేయడం మొదలుకొని పెళ్లి పూర్తి అయ్యేవరకు చాలా రకాల విషయాలు పాటిస్తూ ఉంటారు. పెళ్లి విషయాలలో పూర్వం నుంచి ఇప్పటివరకు అనేక విషయాలను పాటిస్తూ వస్తున్నారు. కొన్ని విషయాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. అటువంటి వాటిలో ఆ తాళిబొట్టు కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడం కూడా ఒకటి. అయితే పెళ్లి తర్వాత ఈ అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు. అలా చూపించడం వెనుక ఉన్న కారణం ఏంటి అన్న వివరాల్లోకి వెళితే..

అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని. మహా పతివ్రత ఆకాశం వైపు పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసార జీవనం సుఖమయంగా కొనసాగుతుందని పండితులు చెబుతుంటారు. మాఘమాసం పంచ మాసాల కాలం తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేల కనపడదు. రాత్రి పూట చంద్రుడి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత బలపడుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం.

శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన మిగిలిన కాలల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున ఈ నక్షత్రం కనిపిస్తుంది.ఆకాశంలో తూర్పు వైపున అరుంధతీ, వశిష్ట అనే రెండు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయని చెబుతారు. ఈ నక్షత్రాలను అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా చెబుతారు. అందుకే వివాహమైన తరువాత జంటలను నక్షత్రాలు చూడవలసిందిగా పూజారి చెబుతారు. వశిష్ఠ, అరుంధతి జంటలాగ కలకాలం జీవించాలని ఈ సందర్భంలో కొత్త జంటను ఆశీర్వదిస్తారు.