కేరళ లోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఈ ఆలయ నేలమాళిగల్లో ఆరు రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్ర వైడ్యుర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారట. అనంత పద్మ నాభ స్వామి ఆలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలని ఎంతోమంది కుతూహలంగా ఉన్నారు. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాల చోట్ల సర్చ్ కూడా చేస్తున్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది.
శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాల సముద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ మనం వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇకపోతే ఈ ఆలయం గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతి హాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్ల భాగవతం పేర్కోటోంది. స్వామివారి గురించి 12 మంది అళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనులు చేశారు.
కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్ధిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు కూడా తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారట. అప్పటి తరాలుగా ట్రావెన్ కోర్ రాజకుంటుబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేమట. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలట. ఈ విషయం చాలామందికి తెలియదు. కాగా ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారట. ఆ కాలంలో 4 వేల మంది శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, 100 ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేల మాళిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించారు.
ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ఏ, బీ, సీ గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్ది ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయట. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ డీ, ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్ది లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచానా. నేల మాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగ బంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని చెబుతున్నారు పండితులు. ఆ గదిలో ఈ ఐదు గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులకుగా ఉంటున్నారు. వెల కట్టనేలని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు.