Kumkum: స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయి?

హిందువులు పసుపు,కుంకుమలను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు అయితే పసుపు కుంకుమను ఐదవతనంగా కూడా భావిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 08:10 AM IST

హిందువులు పసుపు,కుంకుమలను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు అయితే పసుపు కుంకుమను ఐదవతనంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే పెళ్లి అయిన స్త్రీలు నుదుటున కుంకుమ ధరించారు అంటే.. ఆమెకు పెళ్లి అయింది. భర్త ఉన్నాడు అని అర్థం. అందుకే పెళ్లి అయినా స్త్రీలు తప్పకుండా నుదుటున కుంకుమను ధరిస్తూ ఉంటారు. అయితే పెళ్లి అయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటన కుంకుమ ధరించాలి అని సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవి ఆజ్ఞాపించింది అని మన పురాణాలు చెబుతున్నాయి.

అయితే పెళ్లి కానీ అమ్మాయిలు నుదుటున కుంకుమ దరించరు అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయిన స్త్రీ లు మొత్తం 5 స్థానాలలో కుంకుమను దరిస్తారు. మరి స్త్రీలు కుంకుమ దరించే ఆ ఐదు స్థానాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాపిట్లో ఒక బొట్టు పెట్టుకోవాలి. సీతాదేవి పాపిట్లో సింధూరం ధరించి, దాని పై పాపిడిబిళ్ళను ధరించేదట, అయితే ఆంజేయనేయస్వామి ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావు అని అడిగితే, నా స్వామీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని, నా వైపు ఆకర్షితుడవుతాడని చెప్పిందట.

స్వామీ తన శరీరమంతా సింధూరం పూసుకోవడం అలవాటుగా చేసుకుని శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. అలాగే కనుబొమల మధ్యన కుంకుమ పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరగడంతో పాటుగా నిత్య సుమంగళిగా ఉంటారట. అలాగే కంఠం దగ్గర,వక్షస్థలం మధ్యన ఇంకా నాభి దగ్గర కూడా కుంకుమ ను దరిస్తారు. అయితే ఈ అయిదు చోట్ల కుంకుమ ధరించిన స్త్రీకి వైధవ్యం లేకుండా, భర్త కన్నా ముందే తానే సౌభాగ్యవతిగా వెళ్ళిపోవడానికి దోహదపడతాయట. అయితే సీతాదేవి కూడా ఇలా ధరించడం వలనే రాముని కన్నా ముందే తన అవతారాన్ని చాలించింది.