Ramayantra : రామయంత్రం మీద అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఏమిటది ?

Ramayantra : జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
Ramayantra

Ramayantra

Ramayantra : జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. శ్రీరాముడి విగ్రహాన్ని గురువారం రాత్రే గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అయితే సోమవారం రోజు ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు విగ్రహాన్ని వేదమంత్రోచ్ఛరణలతో  రామయంత్రం మీద ఉంచుతారు. ఇంతకీ రామ యంత్రం(Ramayantra) అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

రామయంత్రం ఎలా ఉంటుంది ?

  • రామయంత్రాన్ని భోజ్ పత్ర అనే ఓ రకమైన చెట్టు బెరడు లేదా ఆకుతో తయారుచేస్తారు. రామయంత్రం తయారీలో దానిమ్మ కాడలు, కుంకుమపువ్వు  ఉపయోగిస్తారు.
  • రకరకాల మెటీరియల్స్‌తోనూ రామయంత్రం తయారు చేస్తారు.
  • మీకు పూజ స్టోర్స్ లో రామయంత్రాలు లభిస్తాయి.
  • ఇల్లు కట్టుకునే ముందు శుద్ధిచేసి, ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది.
  • రామయంత్రం ఇంట్లో ఉంటే ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు దరిచేరవు. సుఖశాంతులు, ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో ఉన్న ఎలాంటి  ఇబ్బందులైనా తొలగిపోతాయి.
  • రామయంత్రం చదరపు ఆకారంలో ఉంటుంది.
  • యంత్రం చుట్టూ ప్రత్యేకమైన మంత్రాలు రాసి  ఉంటాయి.
  • యంత్రం మధ్యలో  6 త్రిభుజాలు 8 తామర పూరేకులు ఉంటాయి. వాటి మధ్యలో మధ్యలో మంత్రాలు రాసి ఉంటాయి.
  • యంత్రం మధ్యలోని ఆరు త్రిభుజాల్లో ఒక్కో దాని మీద ప్రత్యేకమైన పదాలు రాస్తారు.
  • యంత్రం మధ్యలో ఉన్న రా రామాయ నమః అని రాసి ఉంటుంది.

Also Read: Chandrayaan 3: నిద్రలేచిన ‘చంద్రయాన్ 3’.. ల్యాండర్ నుంచి మళ్లీ సిగ్నల్స్

ఏపీలో 55 రైల్వేస్టేషన్ల ముస్తాబు

జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా రైల్వే శాఖ రాముడి పేరుతో ఉన్న దాదాపు 343 రైల్వే  స్టేషన్లను  విద్యుద్దీపాలతో అలంకరించనుంది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్‌లోని 55 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తమిళనాడులోని 54 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత రాముడి పేరుతో ఎక్కువ రైల్వే స్టేషన్లు బీహార్‌లో ఉన్నాయి.

అమెజాన్‌లో నకిలీ ప్రసాదాల విక్రయాలు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ ఆన్‌లైన్‌లో నకిలీ ప్రసాదాల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ‘అయోధ్య ప్రసాదం’ పేరిట మిఠాయిలను అమ్ముతోందనే ఆరోపణలతో ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలంటూ గడువు ఇచ్చింది. లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆరోపణలపై అమెజాన్‌ ప్రతినిధి ఒకరు స్పందించారు. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్న విక్రేతలపై చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. దీంతోపాటు రామ మందిర ప్రసాదం పేరిట ఉన్న ఉత్పత్తుల సేల్స్‌ ఆప్షన్‌ను తొలగించినట్లు వెల్లడించారు.

  Last Updated: 20 Jan 2024, 12:22 PM IST