TTD: శ్రీ కృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అదృష్టం: టీటీడీ చైర్మన్

  • Written By:
  • Updated On - February 16, 2024 / 10:49 PM IST

TTD: చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారి జీవితం అందరికి ఆదర్శనీయమని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహల్ సర్కిల్లో శుక్రవారం శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ పునః ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయులు ప్రజా పరిపాలన అధ్బుతంగా సాగించారని, ఓకవైపు ప్రజల క్షేమం, మరోవైపు కళలు, సంస్కృతి, ఆచారాలు, భక్తి వీటినన్నింటిని మేళవించుకొని పరిపాలన చేసిన గొప్ప చక్రవర్తి అని భూమన పేర్కొన్నారు.

తన ఇరవై సంవత్సరాల పాలనలో మన తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని ఏడు సార్లు దర్శించుకొని, వేల కోట్ల విలువ గల్గిన అభరణాలు స్వామికి సమర్పించి, స్వామి వారి కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి కృష్ణదేవరాయులు అని భూమన అన్నారు. అలాంటి శ్రీ కృష్ణదేవరాయుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం తమ అదృష్టంగా టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.