Site icon HashtagU Telugu

Rundhnath Mahadev – ఆ దేవాలయంలో ఎలాంటి ప్రసాదం పెడతారో తెలుస్తే…అక్కడికి అస్సలు వెళ్లరు..!!

Crab1 5e255d4fc9cf6

Crab1 5e255d4fc9cf6

సాధారణంగా గుడిలో ప్రసాదం ఏం పెడుతుంటారు..పులిహోర, దద్దోజనం, చక్కర పొంగలి, పప్పు చక్కెర ఇలా ఇవ్వడం చూసాం. గుడిలో ఇచ్చే ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. అందుకే గుడికెళ్లి దేవుడిని మొక్కినా…మొక్కకున్నా…ప్రసాదం తీసుకోవడం మాత్రం మర్చిపోరు. అయితే కొన్ని ప్రాంతాల్లో పెట్టే ప్రసాదాల గురించి వింటే షాక్ అవుతారు. అవును మాంసాహారాన్ని నైవేద్యంగా పెడతారు. ఏంటీ గుడిలో నాన్ వేజ్ ప్రసాదమా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. కానీ ఇది నిజం. నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంాతాల్లో ఇలాంటి వింత ఆచారాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ఓ గుడిలో పీతలను ప్రసాదంగా పెడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అది అక్షరాల నిజం. ప్రాణాలతో ఉన్న పీతలను ప్రసాదంగా పెడతారు. అంతేకాదు అక్కడి చనిపోయినవారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన వస్తువులను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. గుజరాత్ లోని రుంద్ నాథ్, మహదేవ్ శివాలయంలో పూలు పండ్లతోపాటు ప్రాణాలతో ఉన్న పీతలతో అభిషేకం చేస్తారు. సంవత్సరానికోసారి జరిగే ఈ జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏండ్లుగా కొనసాగుతోంది. ఆ సమయంలో కొన్నివేల మంది భక్తులు దేవుడిని దర్శించుకుంటారు.

సూరత్ లోని రామ్ నాథ్ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ రుంధ్ నాథ్ మహదేవ్ ఆలయంలో మాఘమాస ఏకాదశి రోజున భక్తులు ప్రాణాలతో ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలా దేవుడికి సమర్పించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయం అవుతాయని వారి నమ్మకం. మరణించివారికి కూడా ఇష్టమైన పదార్థాలు సమర్పించి ప్రార్థనలు చేస్తారు. నిజంగా వింతగానే ఉన్నా…ఈ పీతల కోసం జనాలు కొట్టుకోవడం కూడా చేస్తుంటారట. ఏంటో మరి విచిత్రంగా ఉంది కదూ.

 

Exit mobile version