Sakat Chauth : ఈ నెలలోనే “సకత్ చౌత్”.. శుభ ముహూర్తం.. పూజా విధి ఇదీ

ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. సకత్ చౌత్ ఉపవాసాన్ని గణేశుడి (Ganesha) పేరు మీద ఉంటారు.

“సకత్ చౌత్” (Sakat Chauth) పండుగను ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. సకత్ చౌత్ ఉపవాసాన్ని గణేశుడి పేరు మీద ఉంటారు. ఆ రోజున వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. మహిళలు తమ పిల్లల దీర్ఘాయువు, సంతోష కరమైన జీవితం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సకత్ చౌత్‌ను సంకత్ చౌత్, టిల్-కుట్ చౌత్, వక్ర-తుండి చతుర్థి, మాఘీ చౌత్ అని కూడా పిలుస్తారు.

సకత్ చౌత్ (Sakat Chauth) శుభ సమయం ఇదీ:

సకత్ చౌత్ తేదీ, శుభ సమయం జనవరి 10 (మంగళవారం). ఆ రోజున చంద్రోదయ సమయం 8 గంటల 41 నిమిషాలు. జనవరి 10న చతుర్థి తిథి మధ్యాహ్నం 12.09 గంటలకు ప్రారంభమై జనవరి 11న మధ్యాహ్నం 2.31 గంటలకు ముగుస్తుంది.

సకత్ చౌత్ (Sakat Chauth) పూజ విధి:

సకత్ చౌత్ రోజున తెల్లవారు జామున నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. దీని తర్వాత గణేశుడిని పూజించండి. పూజ సమయంలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని తప్పకుండా ఉంచుకోండి. రోజంతా నీరు తాగకుండా ఉపవాసం చేయండి. రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. గణేశుడిని పూజించండి. ఆ తరువాత పండ్లు తినండి. వీలైతే, ఫ్రూట్ డైట్‌లో తీపి వంటకాలను మాత్రమే తినండి, అలాగే రాక్ సాల్ట్ తీసుకోకండి.

ఈ రోజు పూజలో గణేష్ మంత్రాన్ని పఠించడం చాలా మంచిదని అంటారు.  గణేశ మంత్రాన్ని జపిస్తూ గణేశునికి 21 దూర్వాలు సమర్పించడం చాలా శుభప్రదం. గణేష్‌కి లడ్డూలంటే చాలా ఇష్టం. ఈ రోజున గణేష్‌కి బూందీ లడ్డూలను , చెరకు, బత్తాయి, బెల్లం, నువ్వులతో చేసిన ఫుడ్స్ ను నైవేద్యంగా సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

ఈ తప్పులు చేయకండి:

సకత్ చౌత్ రోజున వినాయకుని పూజలో తులసిని ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం.. తులసి మాత వివాహ ప్రతిపాదనను గణేశుడు తిరస్కరించారు. ఆ తర్వాత తులసి మాత .. గణేష్ జీకి రెండు వివాహాలు జరగాలని శపిస్తారు. ఆ వెంటనే గణేశుడు.. తులసి మాతను శపించారు. రాక్షసుడితో తులసికి పెళ్లి జరుగుతుందని ఆ శాపంలో చెప్పారు. అందుకే తులసిని గణేష్ పూజలో ఉపయోగించరు.

“సకత్ చౌత్” రోజున పొరపాటున కూడా గణేశుని వాహనంగా ఉండే ఎలుకలను వేధించకూడదు. ఇలా చేయడం వల్ల వినాయకుడికి కోపం వస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండే మహిళలు నల్లని దుస్తులు ధరించవద్దు.  పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. “సకత్ చౌత్” రోజున పాలు , అక్షతలను నీటిలో కలిపి చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. అయితే అర్ఘ్యం సమర్పించేటప్పుడు అర్ఘ్య జలం కాళ్లపై పడకూడదని గుర్తుంచుకోండి.

Also Read:  Food Habits : మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా?