Site icon HashtagU Telugu

Pooja Tips : పూజా ఫలితం దక్కాలంటే దేవుళ్ళకు నైవేద్యం ఇలా సమర్పించాల్సిందే..

In Order To Get The Result Of The Pooja, The Offering To The Gods Should Be Presented Like This..

In Order To Get The Result Of The Pooja, The Offering To The Gods Should Be Presented Like This..

Tips to be followed while dong Pooja : మామూలుగా హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసేటప్పుడు ఆయా దేవుళ్ళకు ఇష్టమైన పువ్వులతో పాటు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. అయితే నైవేద్యాలు సమర్పించే విషయంలో కొంతమంది మాత్రమే తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. నైవేద్యం విషయంలో పాటించాల్సిన కొన్ని నియమాలను కూడా మరిచిపోతూ ఉంటారు. మరి పూజ (Pooja) ఫలితం దక్కాలంటే దేవుళ్లకు నైవేద్యం ఎలా సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

విష్ణుమూర్తికి పాయసం అంటే అత్యంత ప్రీతికరం. సేమియా లేదా బియ్యంతో పాలు ఉపయోగించి చేసే పాయసాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి. విష్ణువుకు తులసి దళాలు చాలా ఇష్టమైనవి. కనుక ఆయనకు వాటిని సమర్పించుకోవచ్చు. లక్ష్మీదేవికి కూడా ఈ ప్రసాదం ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు. లక్ష్మీ పూజలో (Pooja) కూడా వీటిని వినియోగించవచ్చు. ఉమ్మెత్తు, భాంగ్, పంచామృతాలు శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. వీటితో పాటు మిఠాయిలు ఏవైనా శివుడికి ఇష్టమైనవే. పార్వతి దేవికి పాయసం ఇష్టమైన పదార్థంగా చెబుతారు. అయితే దేవుడికి సమర్పించే నైవేద్యం కచ్చితంగా సాత్వికాహారమై ఉండాలి. అంతేకాదు శుభ్రమైన పదార్ధాలు తాజా పదార్థాలు అయి ఉండాలి.

పూజకు ఉపక్రమించే ముందు వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ప్రధానం. దేవుడికి నైవేద్యం తయారు చెయ్యడానికి ముందు కచ్చితంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి. పాడైపోయిన పదార్థాలు పొరపాటున కూడా భగవంతుడికి సమర్పించకూడదు. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూడకూడదు. దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని తప్పనిసరిగా ముందుగా తీసి ఉంచాలి. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత అది మిగతా భక్తులకు సమర్పించాలి. చాలా మందికి నైవేద్యం సమర్పించడానికి ఎలాంటి మంత్రం ఉచ్చరించాలి అనే విషయం తెలియదు. ప్రత్యేక మంత్రాన్ని నైవేద్య సమర్పించేందకు సూచించారు. గోవింద తుభ్యమేవ్ గర్హన సుముఖో భూత్వ ప్రసిద పరమేశ్వర అనే మంత్రాన్ని చెబుతూ దేవుడికి ప్రసాదాన్ని సమర్పించాలి.

Also Read:  Tollywood Beauties: సెక్సీ పూల్ పార్టీలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్స్