astrology: ఈ రెండు వస్తువులు ఉంటే చాలు.. అదృష్టం మీ వెంటే?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇల్లు, మొక్కలు, వ్యాపార

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 08:04 AM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇల్లు, మొక్కలు, వ్యాపార స్థలం, వస్తువుల అమరికలు ఇలా ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూనే ఉన్నారు. అయితే మనం ఎదుర్కొనే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి వాస్తు విషయాలను పాటించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం జోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల చిట్కాలను చెప్పబడిన విషయం తెలిసిందే. కాగా జ్యోతిష్య శాస్త్రంలో వెండి, చందనం చాలా సుబప్రదమైనవిగా చెబుతారు.

గంధంను పూజ చేసే సమయంలో ఉపయోగిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడి అనుగ్రహం పొందాలి అంటే ఎర్ర చందనం ఉపయోగించాలి. అలాగే శుక్రుడు అనుగ్రహం కావాలంటే పసుపు చందనం, అంగారకుడు అనుగ్రహం కావాలంటే తెల్ల చందనం అవసరం. వీటి వల్ల మీకు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, డబ్బు కలుగుతాయి. మీరు కష్టపడి పనిచేసనప్పటికీ ఆర్ధిక సమస్యలు వెంటాడుతున్నట్లయితే శుక్లపక్షం, శుక్రవారం రోజు మీ దగ్గర వెండి ముక్కను ఉంచుకుంటే ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. మీరు వెండి ముక్కను ఉంచుకోకపోతే మీ చేతి వేళ్ళకి వెండి రింగు వంటిది పెట్టుకోవడం చాలా ప్రయోజనం.

అలాగే శుక్రవారం రోజు వెండి పాత్రలో కుంకుమ తిలకం పూసుకుంటే సుఖ సంతోషాలు, అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, శుక్రుడిని వెండి సంతృప్తి పరుస్తుంది. ఈ వెండి పెట్టుకుంటే మానసిక దృఢత్వాన్ని పొందుతారు. మనసు కూడా ఆనందంగా ఉంటుంది.