Site icon HashtagU Telugu

Shell: పూజగదిలో ఉండే గవ్వల ప్రత్యేకత గురించి మీకు తెలుసా?

Shell

Shell

హిందూ సంప్రదాయంలో శంఖానికి ఎంత ప్రాధాన్యత ఉందో అదేవిధంగా గవ్వలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. హిందువులు గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతేకాకుండా వాటిని దేవుడి గదిలో పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే దీపావళి పండుగ రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. గవ్వల గలగల మనే శబ్దం వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది.

శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి. శివుని జటాజూటం లోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం. అలాగే కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకునే సాంప్రదాయం కూడా ఉంది. ఎవరైనా కొత్త వాహనాలకు పూజ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం బాగా గమనించవచ్చు. అదేవిధంగా గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు.

కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి ఒక బట్టలో గవ్వలను కడతారు. అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది. గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో పెట్టి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. వివాహ సమయంలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుందని కొన్ని ప్రాంతాల వారు విశ్వసిస్తారు. గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక నమ్మకం.