మామూలుగా చాలామంది ఇంట్లో పనికిరాని వస్తువులను అలాగే స్టోర్ రూమ్ లో వేసి ఉంచుతూ ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని లేదంటే గుజిరి సామాన్లకు వేసినా కూడా డబ్బులు వస్తాయని అలాగే ఆ వస్తువులను పాడైపోయిన పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ అలాంటి కొన్ని రకాల వస్తువులు ప్రతికూలతలను పెంచుతాయని, ఇంట్లో జరిగే కొన్ని రకాల అనార్థాలకు కూడా కారణం అవుతాయని చెబుతున్నారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇంట్లో పొరపాటున కూడా ఆగిపోయిన గడియారాన్ని అస్సలు ఉంచకూడదట. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తిని పెంచుతుందట. గడియారం ఆగినప్పుడు సమయం ఆగిపోతుంది. ఇది ప్రతికూల అర్థాన్ని కలిగి ఉంటుందని ఇది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో కూడా ఆగిపోయిన గడియారం ఉంటే వెంటనే అందులో సెల్స్ లు వేయడం లేదంటే బయటపడేయడం లాంటివి చేయాలట.
చాలామంది ఇంట్లో పగిలిన గాజు కప్పులను గాజు పాత్రలను అలాగే ఉంచుతూ ఉంటారు. లేదంటే వాటిని అతికించి మరీ ఇంట్లో మళ్లీ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పగిలిన గాజు కప్పులను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదట. ఇంట్లో విరిగిన పాత్రలు గాజు కప్పులు వంటి ఉంటే అది పేదరికంని సూచిస్తుందట. ఇది దురదృష్టానికి సంబంధించిన అంశంగా కూడా పరిగణించబడుతుందని చెబుతున్నారు.
అలాగే వాడిపోయిన పువ్వులు కూడా ఇంట్లో అస్సలు ఉండకూడదట. ఎండిన పువ్వులను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదట. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుందని, కొత్త క్యాలెండర్లు వచ్చిన వెంటనే పాత క్యాలెండర్లను తీసివేయాలని చెబుతున్నారు. పాత క్యాలెండర్లు గతాన్ని సూచిస్తాయి. అవి గత సంవత్సరాల శక్తిని కలిగి ఉంటాయట. పునరాలోచనలో నివసించడం కంటే ముందుకు సాగడం మంచిదని కాబట్టి గత సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ లు ఉంటే వెంటనే వాటిని బయటకు పారేయడం మంచిదని చెబుతున్నారు.
ముళ్ల మొక్కలు.. కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో అస్సలు నాటకూడదట. ఎందుకంటె ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుందట. ముళ్ల కాక్టస్ మొక్కలను ఇంటి బయట ఉంచడం మంచిదని, ఇంట్లో ఎప్పటికీ ఖాళీ కుర్చీ ఉండటం శ్రేయస్కరం కాదట. ఇది ఆత్మలను ఇంటికి ఆహ్వానిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఎవరైనా క్రమం తప్పకుండా దానిపై కూర్చుండేలా చూడటం మంచిదని లేదంటే అలా ఖాళీగా ఉన్న కుర్చీలను పూర్తిగా తీసివేయడం మంచిదని చెబుతున్నారు.