Site icon HashtagU Telugu

‎Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరిని పూజిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎karthika Masam 2025

‎karthika Masam 2025

‎Karthika Masam: కార్తీక మాసం మొదలైంది అంటే చాలు ఎక్కడ చూసినా కూడా దానధర్మాలు ప్రత్యేక పూజలు పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా శివకేశవుల ఆలయాలు దీపాల అలంకరణతో విరిగిపోతూ ఉంటాయి. ఈ కార్తీకమాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని నమ్మకం. కాగా పవిత్రమైన కార్తీకమాసంలో తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగితాయట.

‎ఈ మాసంలో ఉసిరిచెట్టును పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. కార్తీక పార్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి కొన్ని శ్లోకాలు పఠించాలని చెబుతున్నారు. కాగా ఉసిరి చెట్టు పూజ సాధారణంగా అమావాస్య, పూర్ణిమ, ఇతర ముఖ్యమైన పండుగలు, పర్వదినాలలో నిర్వహిస్తారు. పూజ సమయంలో, చెట్టు వద్ద ఒక చిన్న, లోతులేని గొయ్యి తవ్వి, దానిలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. చెట్టుకు పూలు, పండ్లు, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించి శ్లోకాలను పఠిస్తారు.

‎ఇలా చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఉసిరి చెట్టు చెట్టును విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చట. అంతేకాదు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయట. అందువల్ల ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాలలో ఉసిరి, తులసి మొక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పండ్లకు బదులు మనం ఎవరికైనా మొక్కలను కూడా పంచవచ్చని ఇలా చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే కార్తీక మాసంలో శివుడి ముందు ఉసిరి దీపాలు వెలిగించిన కూడా అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version