Karthika maasam : కార్తీకమాసంలో తులసి పూజ ప్రాముఖ్యత ఏమిటి? తులసిపూజకు సంబంధించిన నియమాలేంటీ. !!

  • Written By:
  • Publish Date - October 28, 2022 / 04:43 AM IST

కార్తీకం అంటే పుణ్యఫలాలను పొందేందుకు స్వచ్చమైన,ఉత్తమమైన మాసం. కార్తీకమాసంలో దీపదానంతోపాటు, విష్ణువుకు ప్రీతికరమైన తులసి పూజిస్తే అంతా మంచి జరుగుతుందన్న నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా నదీ స్నానం. కార్తీకమాసం సాయంత్రం తులసి చెట్టు కింద నెయ్యిదీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. భగవంతుడి అనుగ్రహంతో పవిత్రమైన కార్తీకమాసంలో ఇలా దీపం వెలిగించడం వల్ల శ్రీహరి, లక్ష్మీదేవితోపాటు సకల దేవతల విశేష అనుగ్రహం లభిస్తుంది.

కార్తీక మాసం సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించడం వెనకున్న ప్రాముఖ్యత ఏంటీ.

తులసి కార్తీక మాసంలోని అమావాస్య రోజున జన్మించిందని శాస్త్రాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ మాసమంతా తులసికి అంకితం. హిందూమతంలో తులసిని తల్లిస్వరూపంగా పరిగణిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే సానుకూల శక్తి పెరుగుతుందని, సంపద నుంచి అన్ని రకాల ఆనందం అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. కార్తీక మాసంలో వచ్చే గురువారంనాడు తులసి మొక్కను నాటడం ఉత్తమైనదిగా భావిస్తారు.

తులసి పూజకు సంబంధించిన నియమాలు:
-తులసి మొక్కను ఇంట్లో లేదా ఇంటి ముందు నాటాలి.
-ఉదయాన్నే తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణలు చేయాలి.
-రోజూ సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది.
-ఆదివారం నాడు తులసికి నీళ్లు సమర్పించవచ్చు కానీ దీపం వెలిగించకూడదు.
-తులసి మొక్క నాటిన ప్రాంతంలో పరిశుభ్రతను పాటించాలి.