Site icon HashtagU Telugu

Darpana Darshanam: ఆలయ దర్శనం తర్వాత గుడి మండపంలో కూర్చుని స్మరణం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Mixcollage 04 Jul 2024 08 37 Pm 8719

Mixcollage 04 Jul 2024 08 37 Pm 8719

మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు పూజ అంతా పూర్తి అయిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా మనం గుడిలో కాసేపు కూర్చొని వస్తూ ఉంటాం. ఇంట్లో పెద్దలు కూడా కాసేపు కూర్చొని వెళ్దాం అని పిల్లలకు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇలా ఎందుకు కూర్చుంటారు అలా కూర్చోవడం వెనుక ఉన్న రీజన్ ఏంటి అన్న విషయం చాలా మందికి తెలియదు.. మరి ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎప్పుడైనా సరే గుడి లోపలికి వెళ్లిన తరువాత దేవుని ముందు నిల్చోని రెండు చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దేవుడి దర్శనం చేసుకోవాలి. ఇక దర్శనం అంతా అయిపోయిన తర్వాత గుడి పండపంలో ఒక ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు దేవుడు యొక్క రూపాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనసులో ఈ విధంగా కోరుకోవాలట. నాకు నొప్పి లేదా బాధ కానీ మరణాన్ని ప్రసాదించు. నేను ఎవరి మీద ఆధారపడకుండా నా జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరి వద్ద చులకన కాకుండా ఉండేలా జీవితాన్ని ప్రసాదించు అని కోరుకోవాలట.

అలాగే చావు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకుని విధంగా నన్ను దీవించు అనే దేవుడిని కోరుకోవాలట. వాటితో పాటుగా ఇంకా కొన్ని మనసులో అనుకోవాలట. దేవుడు రూపాన్ని స్మరించుకుంటూ అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధముగా అనుగ్రహించు అని కోరుకోవాలట. నాపై నీ చూపు ఎల్లప్పుడూ ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు అని కోరుకోవాలట.. ఇక పైన చెప్పిన విషయాలు గుడికి వెళ్ళిన తర్వాత మనసులో అనుకుంటూ దేవుడిని స్మరించుకోవడం వల్ల మనకు ఏమి కావాలో మనం అడగకముందే దేవుడే ప్రసాదిస్తాడట.దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణంలో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే.