Site icon HashtagU Telugu

Spirituality: కిచెన్ లో పూజ గది ఉందా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Spirituality

Spirituality

మాములుగా చాలామంది ఇంటి నిర్మాణం సమయంలో బెడ్రూంలో విషయంలో అలాగే వంటగది పూజగది విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పూజగది గురించి శ్రద్ద తీసుకోకపోవడమే కాకుండా అంతగా పట్టించుకోరు అని చెప్పాలి. కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తే, ఇంకొంతమంది కిచెన్ రూములో ఒక పక్కగా చిన్న అల్మరాను కేటాయిస్తారు. చాలా వరకు ప్లేస్ లేకపోవడంతో ఇలాగే చేస్తూ ఉంటారు. ఇకపోతే, చాలామంది ఇళ్లల్లో అసలు పూజగది అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అలాంటి వారు పూజా మందిరాన్ని వాస్తు ప్రకారం ఈశాన్య దిశగా పెట్టుకోవడం చాలా మంచిది.

వంటగది లేదా బాల్కనీలో పూజగదిని ఏర్పాటు చేయడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయట. లివింగ్‌ రూమ్‌‌లో లేదా ప్రత్యేకంగా ఒక గదిలో పూజ మందిరాన్ని ఏర్పాటు చేసున్నట్లయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాగే పాల రాతితో తయారైన పూజ గది చూసేందుకు ఎంతో బాగుంటాయి. వాటి వల్ల గదికే కొత్త అందం వస్తుంది. ఫైబర్‌ తో తయారైన పూజా మందిరాలు కూడా బాగానే ఉంటాయి. వీటి ఖరీదు కూడా కొంచెం తక్కువే. పూజ గదిలో ఇటాలియన్‌ వైట్‌ మార్బుల్స్ లేదా సిరామిక్‌ టైల్స్ వేసినట్లయితే చాలా బాగుంటాయి. పూజ గదిలో ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తులో ప్లాట్‌ఫామ్‌లాగా కట్టి దాని మీద దేవుని పటాలు పెట్టుకోవచ్చు.

కూర్చునేందుకు అక్కడ చిన్న చిన్న చాపలు కూడా పెట్టుకోవచ్చు. ఇక, గోడలకు వినాయకుడు, రాధా కృష్ణ చిత్రపటాలు అలంకరించవచ్చు. టెర్రకోట, బ్రాస్‌ దీపాలను పై కప్పు నుంచి వేలాడదీయవచ్చు. గదిలో ఓమూలగా దీపాల స్టాండ్‌ను అమర్చినట్లయితే పూజగది చాలా అందంగా ఉంటుంది. ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాలని చెబుతున్నారు. దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిదట. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించాలట.

పటాలను గోడకు వేలాడదీయాలి అనుకుంటే దక్షిణ, పశ్చిమ గోడలకు వేలాడదీయాలట. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ గోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చు. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చట. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలో అయినా సరే అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు.