Importance of Pala Pitta: దసరా (Dasara) రోజు వచ్చిందంటే చాలు అందరి చూపు ‘పాలపిట్ట ‘ (Indian Roller/Palapitta ) మీదే ఉంటుంది. పాలపిట్ట ను చూడాలని..ప్రజలంతా భావిస్తారు. అసలు దసరా రోజున పాలపిట్ట (Palapitta ) ను ఎందుకు చూడాలి..? చూస్తే ఏమోవస్తుంది..? పాలపిట్ట నే ఎందుకు చూడాలి..? పాలపిట్ట కు దసరా కు సంబంధం ఏంటి..? ఈరోజుల్లో పాలపిట్టను చూస్తున్నారా..? అసలు పాలపిట్ట కనిపిస్తుందా..? అనేది చూద్దాం.
పాలపిట్ట (Palapitta ) మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతుంటారు. నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపిస్తుంది. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయల్దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మిచెట్టును పూజించి, దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందన్న కథ ప్రచారంలో ఉంది.
త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈ మేరకు దసరా నాడు విజయోత్సాహానికి సూచకంగా శమీ వృక్షాన్ని పూజించడం, సీమోల్లంఘనంతోపాటు పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఏర్పడింది. పండుగ రోజు పాలపిట్టను చూడటం వల్ల మనిషికి సంతోషం, అదృష్టం వరిస్తుందని విశ్వాసం. పాలపిట్టను చూడటం వల్ల మంచితనం, లాభాలు జరుగుతాయట. అందుకే దసరా ప్రతి ఒక్కరు పాలపిట్టను చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు.
కానీ ప్రస్తుత రోజుల్లో పాలపిట్ట (Palapitta ) అనేది కనిపించడమే లేదు. ముఖ్యంగా దసరా రోజున. ఒకప్పుడు పల్లెల్లో ఎక్కువగా పాలపిట్ట అనేది కనిపిస్తుండేది..కానీ ఇప్పుడు పల్లెల్లో కాదు కదా..అడవుల్లో కూడా కనిపించడం లేదు. మన పిల్లలు పాలపిట్ట ఎలా ఉంటుందని అడిగితే ఫోన్ లలో చూపించాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also : White Spots on Nails : గోరుపై తెల్లటి మచ్చ ఈ వ్యాధి లక్షణం, నిర్లక్ష్యం చేయకండి..!