Site icon HashtagU Telugu

Oil Bath: దివాళి రోజు శరీరానికి నూనె పట్టించి ఎందుకు స్నానం చేస్తారో తెలుసా?

Bath

Bath

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకోనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. మరికొందరు నవంబర్ 1న దీపావళి పండుగను జరుపుకోనున్నారు. అయితే ఈ దీపావళి పండుగకు ఇంటిని అందంగా అలంకరించడంతోపాటు అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం. అటువంటి వాటిలో శరీరానికి నూనె పట్టించి స్నానం చేయడం కూడా ఒకటి. అయితే ఇలా ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న కారణం ఏంటి అన్న విషయం చాలా మందికి తెలియదు.. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చమురు స్నానం ని సంస్కృతంలో తైల స్నానం అని కూడా అంటూ ఉంటారు. హిందూ గ్రంథముల ప్రకారం చంద్రుడికి సంబంధించిన రోజులు అంటే శనివారం,సోమవారం, బుధవారం, శుక్రవారం చమురు స్నానం చేయడం మంచిది. సూర్యుడికి సంబంధించిన రోజులైనా ఆదివారం, మంగళవారం , గురువారాల్లో అస్సలు చమురు స్నానం చేయకూడదట. ముఖ్యంగా శనివారం , శుక్రవారం ఈ చమురు స్నానం చేయడం స్త్రీ పురుషులు ఇద్దరికీ చాలా మంచిదని గ్రంధాలు చెబుతున్నాయి. అమావాస్య , పౌర్ణమి, ఒక నక్షత్రాల రోజున ఈ స్నానం అస్సలు చేయకూడదట. పురుషులు ఎప్పుడైతే ఈ చమురు స్నానం చేస్తారో, ఆ సమయంలో వారు తలతో పటు శరీరానికి అంతా చమురు రాసుకోవాలట.

ఆ సమయంలో ఈ ఏడుగురి చిరంజీవులైన అశ్వథామ, బలి, వ్యాస, హనుమాన్, విభీషణ, కృప, పరశురామ ఆశీర్వాదాలు దక్కడానికి ఒక మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం మంచి ఆరోగ్యంతో జీవిస్తారట. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే.. అశ్వథామో బలిర్ వ్యాసో హనుమానశ్చ విభీషణః, కృపః పరశురామశ్చ , సప్తైతే చిరంజీవినాహ్.

ఇకపోతే స్త్రీల విషయానికి వస్తే.. స్త్రీలు” అహల్య ద్రౌపది సీత తార మండోదరి తథా పంచకన్యాహ్ స్మరేన్నిత్యం మహాపాతక నాశనం ” అనే ఈ మంత్రం ని జపించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అహల్య, ద్రౌపది, సీత, తార మరియు మండోదరి అనే ఈ ఐదు పాత్రలను పంచ కన్యలు అంటారు. వీరి యొక్క ఆశీర్వాదాలు సర్వపాపాలను పోగొడతాయట.

మాములు రోజుల్లో స్నానం చేయడం ఒక ఎత్తు అయితే చతుర్దశి వంటి రోజులలో లింగ బేధం లేకుండా ఎవరైనా ఈ చమురు స్నానం చేయడం మరింత మంచిదని చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సంస్కృతంలో ఆయుష్ కారకన్ గా పిలవబడే శని చతుర్దశి ని పరిపాలిస్తాడు. శనివారం ఇందిర పరిపాలిస్తారు అని గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా చేయడం అందరికీ మంచిదని చెబుతున్నారు. అయితే శని వారాల్లో చమురు స్నానం చేయడం వల్ల శనీశ్వరుడని ప్రసన్నం చేసుకోవచ్చట. అతడు పరీక్షలు పెట్టే సమయంలో జరిగే చెడు ప్రభావాలను కూడా తగ్గించుకోవచ్చట. అశ్విన నెలలో చీకటి పక్షం రోజులలో 14 వ రోజున తెల్లవారుజామున ప్రతిఒక్కరు చమురు స్నానం చేయాలట. శరీరానికి మొత్తం చమురు రాసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఒకవేళ నరకచతుర్దశి ఆదివారం గనుక పడితే, స్వాతి నక్షత్రం ఆ రోజున పరిపాలిస్తూ ఉంటుంది. గనుక ఏదైనా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి స్నానం చేసుకోవాలి. దీపావళి రోజున లక్ష్మి దేవి చమురులో ఉంటుంది. గంగాదేవి గోరువెచ్చని నీటిలో ఉంటుంది. ఈ రెండింటిని ఉపయోగించి స్నానం చేయడం వల్ల దురదృష్టం దూరం అవుతుందట.

స్నానం చేసుకున్న తర్వాత కొత్త బట్టలు మరియు నగలు వేసుకోవాలి. అలాగే ముఖం పైన, కళ్ళకు, ముక్కు పైన, ఎక్కడెక్కడ అయితే వెంట్రుకలు ఉంటాయో అక్కడ అంతా,చెవులు, చంకలు, బొడ్డు, గజ్జ మరియు గుదము భాగాల్లో నూనె రాయాలి.
శరీరం లో మిగతా భాగాల్లో కూడా నూనె రాసుకోవాలి. తల నుండి నూనెను తీసుకొని మిగతా భాగాలకు రాయకూడదు. అరగంట లేదా ముప్పావు గంట వరకు శరీరాన్ని అలానే వదిలేయాలి. ఆ తర్వాత నూనె మొత్తం శరీరం నుండి వెళ్లిపోవడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మొదట తలస్నానం షికాయితో చేయడం మొదలు పెట్టాలి. అయితే సూర్యుడు ఉదయించిన తర్వాత మూడు గంటల లోపల ఈ చమురు స్నానం చేయడం చాలా మంచిది.