సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. అందుకే సోమవారం రోజున భక్తులు పరమశివుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కాగా శివుడిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మల్లికార్జునుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, బోలాశంకరుడు, గరలకంటడు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సోమవారం రోజున ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక పరమేశ్వరుడికి ఇష్టమైన వాటిలో మారేడు దళం కూడా ఒకటి. దీనినే చాలామంది బిల్వపత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. తప్పనిసరిగా పరమేశ్వరుడి పూలో ఈ బిల్వపత్రి ఆకును ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే ఈ కైలాసనాథుడిని ఆరాధించేటప్పుడు అనేక మంది ముందుగా బిల్వపత్రాలతో పూజించడం పూర్వ కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు మారెడు చెట్టుకు గల బిల్వ పత్ర ఆకులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తారని చాలా మంది నమ్ముతారు. మరి శివుడికి పూజ చేసేటప్పుడు ఈ బిల్వపత్ర ఆకులు ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బిల్వ పత్ర ఆకులు బిల్వపత్ర ఆకులను చూస్తే బ్రహ్మ, విష్ణు , శివుడు అనే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారని అనేక మంది హిందూ భక్తులు నమ్ముతారు. అలాగే ఈ బిల్వ పత్రాలలో ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉన్నాయని కూడా పురాణాలలో పేర్కొనబడింది. అందుకే ఈ మారేడు చెట్టును ఒక దైవంగా భావించి ఆ చెట్టును కూడా అనేక మంది హిందువులు కొలుస్తారు.
శిoవుడిని ప్రేమించే ఆకులు హిందూ పురాణాల ప్రకారం ఈ బిల్వ పత్ర ఆకులు శివుడిని ప్రేమిస్తాయట. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. శి అంటే శాశ్వత ఆనందం. పురుషుల శక్తి అని వ అంటే మహిళల శక్తి అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి. శివాలయాల వద్ద బిల్వ మొక్కలుశివుడిని ఆరాధించే అనేక మంది భక్తులు, శివాలయాల వద్ద బిల్వ మొక్కను ఎక్కువగా పెంచుతారు. బిల్వ చెట్టు శివుని రూపం అని కూడా చాలా మంది నమ్ముతారు. బిల్వ ఆకులు మూడు వేదాలు అని, వాటి కొమ్మలు ఉపనిషత్తులు, బిల్వ పత్ర చెట్టు రాజు అని అనేక మంది హిందువుల నమ్మకం. అలాగే మారెడు చెట్టును ఆరాధిస్తే పేదరికం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలలో చెబుతున్నాయి. బిల్వపత్రంలో ఇవి ఉండకూడదట. శివుని పూజ కోసం బిల్వపత్ర ఆకులలో తెల్లని మచ్చలు ఉండకూడదు. అలాగే ఆకులు చిరిగిపోయి ఉండకూడదట.
అలాగే ఈ బిల్వపత్ర ఆకుల మీద ఎలాంటి పురుగులు ఉండకూడదు. అందుకే శివుని పూజకు ఈ ఆకులను తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. బిల్వపత్రాలతో సానుకూల శక్తి బిల్వపత్రంలోని మూడు ఆకుల నుండి వచ్చే శక్తి మనకు కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివతత్వ ఆకుల చివర నుండి వాతావారణంలోకి వ్యాపించి సానుకూల శక్తిని ఇస్తుంది. అయితే శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు బిల్వప్రతాలతో అనేక మంది పూజ చేస్తారు. శివుడికి బిల్వపత్ర ఆకులతో పాటు గంధపు చెక్క, పువ్వులు, పండ్లు, నువ్వులు కూడా సమర్పించవచ్చు. అలాగే శివుడికి పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.