Site icon HashtagU Telugu

Importance of Marriage : పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం.. తెలుసా ?

Love Marriage

Importance of Marriage : పెళ్లి అంటే జీవితంలో కీలక ఘట్టం. చాలామంది ఇటీవల కాలంలో ఈ పెళ్లినే వద్దని అనుకుంటున్నారు. ఇంకొందరు లేటుగా పెళ్లి చేసుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. వాస్తవానికి అన్ని మతాలు కూడా పెళ్లికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయి. వివాహ బంధం పవిత్రతను అన్ని మతాలు చాటిచెబుతున్నాయి.  ప్రత్యేకించి హిందూమతంలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. దాని ప్రాధాన్యాన్ని చాలాచోట్ల ప్రత్యేకంగా వివరించారు. రామాయణంలో ‘‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన| వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||’’ అనే శ్లోకంలో పెళ్లి గురించి చక్కగా చెప్పారు. సీతామాతను రాముడికి ఇచ్చి పెళ్లి చేసే సందర్భంగా జనక మహారాజు చెప్పిన అద్భుత పదాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. ‘‘ఓ రామచంద్రా ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ చారిణిగా ఈమెను అందిస్తున్నాను. ఈమె చేయిపట్టుకుని భార్యగా స్వీకరించు. నీకు అన్నీ శుభాలే జరుగుగాక’’ అని ఈ శ్లోకంలో జనక మహారాజు చెప్పారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో ఈ శ్లోకాన్ని చెప్పిస్తారు.  సీతలాంటి నా కుమార్తెను రామచంద్రుడి లాంటి నీకు అప్పగిస్తున్నానని దీని అర్థం. ‘‘ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః’’ అనే మరో శ్లోకం వంశపరంపరను తెంచేయవద్దు అనే సందేశం ఇస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

మూడు రుణాలు

ఋషి ఋణం, దేవ ఋణం,  పితౄణం అనే మూడు రుణాలను  తీర్చుకునేందుకు పెళ్లి(Importance of Marriage) చేసుకోవాలని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మూడు రుణాలను తీర్చకుంటే మరోసారి మనిషిగా పుట్టి కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రుణాలను తీరిస్తే  కైవల్యం దిశగా మన ప్రస్థానం వెళ్తుంది.

Also Read :Hindenburg Research : హిండెన్‌బర్గ్ నివేదిక అవాస్తవం.. అదానీ గ్రూపుతో సంబంధం లేదు : సెబీ ఛైర్‌పర్సన్

Also Read :Drugs On Dark Web : డార్క్ వెబ్‌లో డ్రగ్స్.. స్పీడ్ పోస్టులో డెలివరీ.. గుట్టురట్టు

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.