Importance of Temples : ఆలయాలను ఎందుకు నిర్మిస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటి ?

పూర్వకాలంలో దేవాలయాలకు అనుబంధంగా వేదపాఠశాలలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు అవి.. కొన్ని పెద్ద పెద్ద ఆలయాల వరకూ మాత్రమే పరిమితమయ్యాయి. వేదాన్ని నేర్చుకునేవారు..

Published By: HashtagU Telugu Desk
importance of temples

importance of temples

Importance of Temples : హిందూ సంప్రదాయంలో దేవాలయాలు ఎంతో పవిత్రమైనవి. రోజుకొక దేవుడిని పూజిస్తూ.. ఒక్కో దేవునికి ఒక్కో ఆలయాన్ని నిర్మిస్తుంటారు. ఆలయాలు సకల దేవతల నిలయాలుగా భావిస్తారు. ఆలయం లేని ఊరిలో అరక్షణం కూడా ఉండొద్దని పెద్దలు చెబుతుంటారు. దేవాలయంలో ఉండే గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయం, పరివార దేవతల వరకూ.. అన్నింటికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దేవాలయం అంటే కేవలం దైవాన్ని ఆరాధించే స్థానం మాత్రమే కాదు. అందరికీ జ్ఞానాన్ని, విద్యను పంచే స్థానం కూడా. కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా ఆ దైవానికి చెప్పుకుంటే వింటారని నమ్ముతారు భక్తులు.

పూర్వకాలంలో దేవాలయాలకు అనుబంధంగా వేదపాఠశాలలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు అవి.. కొన్ని పెద్ద పెద్ద ఆలయాల వరకూ మాత్రమే పరిమితమయ్యాయి. వేదాన్ని నేర్చుకునేవారు కూడా చాలా వరకూ తక్కువగానే ఉన్నారు. ప్రతిరోజూ దేవున్ని పూజించి.. నైవేద్యం పెట్టి.. దానిని ప్రసాదంగా భక్తులకు, అన్నార్తులకు పంచడం ద్వారా ఆలయాలు అభాగ్యుల ఆకలిని తీర్చే కేంద్రాలుగా నిలుస్తున్నాయి.

అలాగే ఆలయాల్లో నిర్వహించే కథా కాలక్షేపాలు, వ్రతాలు, వేడుకల ద్వారా అవి గొప్ప సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయి. ఆలయాల వద్ద ఉండే సత్రాలు.. బాటసారులకు వసతిగా, ప్రకృతి విలయాల సమయంలో రక్షణ స్థావరాలుగా నిలుస్తున్నాయి. విధుల నిర్వహణ ద్వారా ఎంతోమందికి ఉపాధినిచ్చే కేంద్రాలుగా ఆలయాలు నిలుస్తున్నాయి. ప్రతి ఊరిలో ఒక ఆలయం ఉంటే.. అది ఆ ఊరికి రక్షగా ఉంటుందని, ఆలయంలో ఉండే దైవం తమను ఎప్పుడూ కాపాడుతారని భక్తుల నమ్మకం. అందుకే ప్రతిచోటా ఆలయాలను నిర్మిస్తుంటారు.

Also Read : Dasara 2023 : శరన్నవరాత్రులకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి .. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం

  Last Updated: 14 Oct 2023, 02:41 PM IST