Site icon HashtagU Telugu

Karthika Masam : కార్తీక మాసం స్నానాలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు..

Importance and Benefits of Karthika Masam Snanalu Cool Water Bathing

Karthika Masam Snanalu

కార్తీకమాసం(Karthika Masam)లో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే మంచిదని చెబుతారు. అయితే అసలు ఆ సమయంలో లేవడం, స్నానం చేయడం వలన మన ఆరోగ్యానికి కూడా మంచిది. కార్తీక మాసం నెల రోజులు కార్తీక స్నానాలు చేయడం వలన మనలో బద్దకం పోతుంది. సాధారణంగా స్నానం చేయడం వలన మనం శుభ్రంగా ఉంటాము. అయితే మనం స్నానం(Bath) చేసే సమయం, విధానం వలన కూడా ప్రత్యేకత అనేది ఉంటుంది.

కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో కాలువలు, చెరువులు లేదా బావుల లోని నీటితో చన్నీటి స్నానం చేస్తే మంచిది అంటారు. ఈ విధంగా కార్తీక మాసంలో స్నానాలు చేయడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారు. కార్తీకమాసం రాగానే చలికాలం కూడా మొదలవుతుంది. అయితే ఈ చలిలో మనకు బద్దకంగా ఉండి ఎక్కువసేపు నిద్ర పోవాలని అనిపిస్తుంది కానీ ఈ చలిలో కూడా మనం ఉదయాన్నే లేచి స్నానం చేయడం వలన మనలో ఉన్న బద్దకం పోయి హుషారుగా తయారవుతాము. ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటాము. మనం ఉదయాన్నే లేవడం వలన మన పనులన్నీ తొందరగా పూర్తవుతాయి.

కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు కావున వేడి తక్కువగా ఉంటుంది. చల్లదనానికి ముడుచుకొని పడుకోవడం వలన నరాల బలహీనత వలన వచ్చే నొప్పులు ఎక్కువ అవుతాయి. అదే మనం కార్తీకమాసం స్నానం చేయడం వలన నొప్పులు తగ్గుతాయి. కార్తీకమాసం వచ్చే సమయానికి వర్షాలు తగ్గి నదులు, కాలువల్లో నీటి ఉదృతి తగ్గి నీటిలో మలినాలు అడుగుకు చేరుకొని నీరు స్వచ్ఛముగా తయారవుతాయి. ఈ నీటిలో ఉండే ఔషధాలు కూడా మనలో ఉండే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి కార్తీకమాసం స్నానం చేయడం అనేది ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా మనకు మంచిది. అందుకే మన పెద్దలు కార్తీక మాసంలో నదుల వద్ద, సముద్రాల వద్దకు వెళ్లి పుణ్య స్నానాలు చేస్తారు. ఇప్పటికి పల్లెటూళ్లలో చాలా మంది ఆచరిస్తారు.

 

Also Read : Karthika Masam : కార్తీక మాసంలో దీపాలను ఎందుకు వెలిగిస్తారు మీకు తెలుసా?