Tulasi Plant: తులసి పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఇక అంతే సంగతులు?

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమపవితంగా భావించడంతోపాటు దేవతగా భావించి భక్తిశ్రద్ధలతో

Published By: HashtagU Telugu Desk
Tulasi Plant

Tulasi Plant

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమపవితంగా భావించడంతోపాటు దేవతగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉంటుంది. అలాగే తులసి మొక్కను పూర్వకాలం నుంచే అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తూనే ఉన్నారు. ఆయుర్వేదంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. మరి అటువంటి పరమ పవిత్రమైన తులసి మొక్క పూజా విధానం జాగ్రత్తలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తులసి మొక్కలో విష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే స్నానం చేయకుండా ఎప్పుడు తులసి మొక్కను తాకకూడదు. అలాగే తులసి ఆకులను కోయరాదు. తులసి ఆకులను కేవలం ఉదయం లేదంటే పగలు మాత్రమే తెంపుకోవాలి సాయంత్రం సమయంలో తులసి మొక్కను ముట్టుకోకూడదు. పురాణాల ప్రకారం తులసి ఆకులను తెంపడానికి గోళ్లను ఉపయోగించకూడదు. గోటి సహాయంతో వాటిని తెంపరాదు. అలాగే ఎండిన తులసి ఆకులు నేలపై పడితే వాటిని తొక్కని ప్రదేశాలలో పడేయాలి. ఆ ఆకులను మళ్లీ తులసి మొక్కలో వేయడం మంచిది. తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. అదేవిధంగా ఆదివారం,ఏకాదశి, గ్రహణం సమయంలో తులసి ఆకులను కోయకూడదు.

అలాగే తులసి మొక్కకు నీరు కూడా పోయకూడదు. మరి ముఖ్యంగా ఆదివారం ఏకాదశి సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఎందుకంటే ఈ రెండు రోజులలో తులసి విష్ణు కోసం ఉపవాస దీక్షలో ఉంటుంది కాబట్టి నీరు తీసుకోదు. అలాగే తులసి దళం లేకుండా దేవుడిని ఆరాధించడం సంపూర్ణంగా పరిగణించబడదు. తులసీదళం లేని విష్ణువు కృష్ణుడు రామ భక్తుల ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది.

  Last Updated: 22 Nov 2022, 08:27 PM IST