అపరాజిత.. గో కర్ణి.. క్రిష్ణ కాంత.. విష్ణుకాంత.. మనీ బెల్..సంపద ద్రాక్ష ఇలా ఎన్నో పేర్లు ఆ మొక్కకు ఉన్నాయి. ఈ మొక్క వల్ల.. దానికి పూసే తెలుపు, నీలం రంగుల పువ్వుల వల్ల ఇంట్లోకి సిరి సంపదల ప్రవాహం కొన సాగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తెల్లని అపరాజిత పువ్వు శుద్ధి చేయడానికి, కళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ పువ్వు , జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని చెబుతారు.
ఇతర బెనిఫిట్స్
* తెల్ల మచ్చలు, మూత్ర సమస్యలు, ఉబ్బరం, విషాన్ని తొలగించడంలో అపరాజిత పువ్వు
ఉపయోగపడుతుంది.
* అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఉత్తర దిశలో నాటాలి.
* అపరాజిత మొక్క పెరిగే కొద్దీ మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
* శని భగవానుడికి కూడా నీలి రంగులోని అపరాజిత పువ్వులను సమర్పించడం వల్ల మీకు శని మహా దశ బాధ నుండి ఉపశమనం లభిస్తుంది.
* ఈ పువ్వులను విష్ణుమూర్తికి సమర్పిస్తే మీకు ఓటమి అనేదే ఉండదట.
* తెలుపు రంగు అపరాజిత మొక్క ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. ఇది మన ఇంట్లో ఉన్నంత సేపు సంతోషం, ప్రశాంతత నెలకొటాయి. ఆహార ధాన్యాల వంటి వాటికి లోటు అనేదే ఉండదు.
* ఈ పువ్వులను విష్ణుమూర్తికి సమర్పిస్తే మీకు ఓటమి అనేదే ఉండదట. అలాగే శని భగవానుడికి కూడా నీలి రంగులోని అపరాజిత పువ్వులను సమర్పించడం వల్ల మీకు శని మహా దశ బాధ నుండి ఉపశమనం లభిస్తుంది.
* వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ తీగను మీ ఇంటికి ఉత్తర దిశలో నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కచ్చితంగా వస్తాయి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శాంతి అనేది ఉంటుంది. అయితే ఈ తీగను ఎప్పటికీ పశ్చిమ దిశలో లేదా దక్షిణ దిశలో నాటకూడదని గుర్తుంచుకోండి.
* నీలిరంగు అపరాజిత మహావిష్ణువుకు చాలా ప్రియమైనది. ఇంట్లో పెట్టుకుంటే శుభం, మేలు.
* నీలం అపరాజిత నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు..ఆర్థిక సంక్షోభంలో లాభదాయకం..వాస్తు శాస్త్రం ప్రకారం నీలి అపరాజిత తీగను తన ఇంట్లో నాటిన వ్యక్తికి అతని ఇంట్లో డబ్బు సంబంధిత సమస్యలు ఉండవు. ఈ తీగను సంపద ద్రాక్ష అని కూడా అంటారు. ఇంట్లో దీన్ని పెట్టుకోవడం వల్ల అది డబ్బును తన వైపునకు ఆకర్షిస్తుంది.