Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీ కటాక్షం కావాలా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Lakshmi Devi

Lakshmi Devi

ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి అప్పులు లేకుండా పైకి ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మిదేవి అనుగ్రహం ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే సంపాదించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు అవుతున్నాయి అని బాధపడుతూ ఉంటారు. లక్ష్మి అనుగ్రహం కోసం అనేక పూజలు వ్రతాలు కూడా చేస్తుంటారు. అంతేకాకుండా చాలామంది అనేక రకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది డబ్బు ఉంది కదా అని గర్వం ప్రదర్శిస్తూ ఉంటారు. డబ్బు ఉంది కదా అని ఎదుటి వాళ్లను అవమానించకూడదు, అగౌరవ పరచకూడదు. సంపద ఉంది కదా అని గర్వపడే వారిపై లక్ష్మీ కోపగించుకొని వెళ్లిపోతుంది.

లక్ష్మీ అనుగ్రహం లేకుండా రూపాయి నిలవడం చాలా కష్టం. అదేవిధంగా ఇంట్లో తరచుగా రామాయణం, భారత, భాగవతాల వంటివి నిరంతరం పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరిస్తాయి. ఇలాంటి గ్రంథ పఠనం ద్వారా నిరంతరం ఇంట్లో భగవన్నామ స్మరణ చేస్తుంటారు ఫలితంగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి దానధర్మాలు చేయమని చెబుతోంది. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టించడం, అవసరం ఉన్న వారికి చేతి సాయం చెయ్యడం వంటి వాటి వల్ల పుణ్యం కలుగుతుంది. ఫలితంగా అనుకున్నవి సాధించగలుగుతారు. లక్ష్మీకటాక్షం కూడా దొరకుతుంది. గరుడ పురాణాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పితృదేవతలను ఆరాధించుకోవాలి.

తెల్లవారు జామున నిద్రలేచి స్నానాధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పితృదేవతలు, దేవుళ్ళను పూజించాలి. స్త్రీలు ఎప్పుడు ఉదయం స్నానం చేసిన తరువాతనే వంటగది లోకి వెళ్ళాలి. వంట గదిలో వండిన ప్రతి వంటకం భగవంతుడికి అర్పించిన తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ ఆ ఇంటిని వదిలిపోదు. ఇంట్లో వండిన ఆహారంలో మొదటి ముద్దను ఆవుకు, చివరి ముద్దను కుక్కకు పెట్టాలని గరుడ పురాణం చెబుతోంది. అందువల్ల లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు శని అనుగ్రహం కూడా లభిస్తుంది.

Exit mobile version