Site icon HashtagU Telugu

Lord Shiva: శివుడి రూపమైన ఈ దేవుడికి పూజలు చేస్తే.. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు

Lord Shiva

Lord Shiva

Lord Shiva:  కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే… బుధవారం పూట చేయాలి. కాలభైరవుడిని పూజించడం ద్వారా దరిద్రం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి వుందంటున్నారు.

ఆధ్యాత్మిక పండితులు. ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే.. వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి. మాంసాహారం ముట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్లాలి. రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి, పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి. తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి.కాలభైరవుని తలచి ధ్యానించాలి. తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచి పెట్టాలి. మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి.