Site icon HashtagU Telugu

Banana Tree : వారంలో ఆ రోజు అరటి చెట్టుని పూజిస్తే చాలు.. కోరిన కోరికలు నెరవేరడం ఖాయం..

If You Worship The Banana Tree On That Day Of The Week, Your Wishes Will Be Fulfilled.

If You Worship The Banana Tree On That Day Of The Week, Your Wishes Will Be Fulfilled.

Worship Banana Tree on this day : హిందూ సంప్ర‌దాయం ప్రకారం వారంలో ప్రతి రోజుకు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఎందుకంటే ఆయా రోజుల‌కు ఒక నిర్దిష్ట దేవతతో ముడిపడి ఉంటుంది. ఆ రోజు ఆ దేవ‌త‌ను పూజించ‌డం ద్వారా జీవితంలో శాంతి, సౌభాగ్యం ల‌భిస్తాయి. అందుకే హిందువులు ఒక్కోరోజు ఒక్కో దేవుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ, బుధవారం వినాయక ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ ఉంటారు. ఆ విధంగా గురువారం శ్రీ మ‌హా విష్ణువుకు, బృహస్పతికి అంకితం చేశారు. ఈ రోజు శ్రీమహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి, ఆరాధించిన తర్వాత అరటి చెట్టుకు (Banana Tree) పూజ చేసే ఆచారం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

హిందూ ఆచారాల ప్రకారం, బృహస్పతి అరటి చెట్టు (Banana Tree)లో నివసిస్తాడ‌ని విశ్వ‌సిస్తారు. మరి గురువారం రోజు అరటి చెట్టును పూజిస్తే, దేవతల గురువు, బృహస్పతితో పాటు శ్రీమహావిష్ణువు సంతోషిస్తారని భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తారని చెబుతారు. గురువారం నాడు బృహస్పతిని ఆరాధించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. చేతికి రావాల్సిన డబ్బు కూడా సమయానికి అందుతుంది. ఇక పెళ్లి కాని వారికి పెళ్లి యోగం ఉంటుంది. ఇకపోతే అరటి చెట్టును ఎలా పూజించాలి? అన్న విషయానికి వస్తే.. గురువారం తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసిన‌ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి.

అనంత‌రం, ఈశాన్య స్థానంలో శ్రీ మ‌హా విష్ణువు ప్ర‌తిష్ఠించి పూజ నిర్వ‌హించి, అరటి చెట్టును పూజించాలి. పూజ చేసేటప్పుడు అరటిచెట్టుకు పసుపు, శనగపప్పు, బెల్లం, అక్షత, పూలు సమర్పించాలి. తర్వాత నేతితో దీపం వెలిగించి, హారతి ఇచ్చి, అరటిపండు నివేద‌న చేయాలి. గురువారం నాటి కథను చదివిన తర్వాత, అర‌టి చెట్టుకు ప్రదక్షిణలు చేసి, మీ కోరికలు తీర్చమని శ్రీ‌మ‌హా విష్ణువును ప్రార్థించాలి. అయితే ఇంట్లో అరటి చెట్టు పెట్టి పూజ చేయకూడదు. ఇంటి బయట లేదా గుడిలో చెట్టు ఉంటే అక్కడ పూజలు చేయడం ద్వారా త్వ‌ర‌గా ఫ‌లితం ఉంటుంది.

Also Read:  Kubali Rice: ఎంతో టేస్టీగా ఉండే కుబాలి రైస్.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?