Site icon HashtagU Telugu

Goddess Lakshmi : మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలంటే… గవ్వలతో లక్ష్మీదేవిని ఇలా పూజించండి..!!!

goddesses lakshmi

goddesses lakshmi

లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇల్లు సుఖశాంతులతో వెల్లివెరిస్తుంది. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తారు. అమ్మవారిని పూజించే సమయంలో చాలా వస్తువులను ఉపయోగిస్తుంటారు. ఇందులో గవ్వలు కూడా ఉంటాయి. గవ్వలు, లక్ష్మీదేవి సముద్రం నుంచి జన్మించారని భక్తులు నమ్ముతుంటారు. తంత్రశాస్త్రంలో గవ్వలను లక్ష్మీదేవితో అనుసంధానించడం కనిపిస్తుంది. గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయట.

అంతేకాదు గవ్వలతో ఎన్నో రకాల నివారణలు కూడా చేయవచ్చు. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ గవ్వలను ఆవులను, ఇంటిని అలంకరించడానికే కాదు…ఇతర వస్తువుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. గవ్వలతో అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

– శనివారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు గవ్వలను ఉంచండి. ఈ పూజను సాయంత్రం చేస్తే మంచిది. పూజ చేసిన తర్వాత ఒక గవ్వను మీ పర్సులో ఉంచకోండి. ఆ తర్వాత మరొకదానిని బీరువాలో ఉంచండి. మిగిలిన గవ్వలను ఎరుపు రంగు బట్టలో కట్టండి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

-ఉద్యోగం విజయం, వ్యాపారంలో పురోగతి కోసం కూడా గవ్వలతో పూజలు చేయవచ్చు. ఆలయంలో 11 గవ్వలను సమర్పించండి. ఒక ఎర్రరంగు బట్టలో 7 గవ్వలను కట్టి, ఇంటర్వ్యూ సమయంలో వాటిని మీతో తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల సక్సెస్ మీ సొంతం అవుతుంది.

-కొత్త ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో 21 గవ్వలు వేయండి. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. చేపట్టిన వ్యాపారంలో లాభం పొందాలనుకుంటే మీ బీరువాలో 7 గవ్వలను ఉంచండి. ఉదయం, సాయంత్రం వాటిని మీతో తీసుకెళ్లండి.

-11 గవ్వలను ఎర్రటి వస్త్రంలో కట్టి ప్రధాన ద్వారా వద్ద వేలాడదీయండి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూలతని తెస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.

-శ్రావణమాసంలో 11 గవ్వలను తీసుకుని ఒక పసుపు గుడ్డలో కట్టి ఎవరికీ కనిపించకుండా ఉత్తర దిక్కున పెట్టాలి. ఇలా చేస్తే కుబేరునికి సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

-అంతేకాదు శుక్రవావరం పసుపు కలిపిన నీటిలో కొన్ని తెల్లగవ్వలు నానబెట్టండి. అనంతరం వాటిని ఎరుపు రంగు బట్టలో కట్టి దాచిపెట్టాలి. ఇలా చేస్తే మంచి లాభాలు పొందుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి.