Astro : అప్పుల్లో కూరుకుపోయారా, అయితే ఈ ఉంగరం ధరిస్తే, కష్టాలు పరార్..!!

వాస్తుప్రకారం తాబేలు ఉంగరం ధరించడం వల్ల కేరీర్ లో సక్సెస్ సాధించడంతోపాటు..జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు.

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 06:00 PM IST

వాస్తుప్రకారం తాబేలు ఉంగరం ధరించడం వల్ల కేరీర్ లో సక్సెస్ సాధించడంతోపాటు..జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా జ్యోతిష్యం గురించి అవగాహన ఉన్నవారికి తాబేలు గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

తాబేలు ఉంగరం ధరిస్తే కలిగే ప్రయోజనాలు:
తాబేలు ఉంగరం ధరిస్తే దురదృష్టం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఉంగరం ధరించినవారిపై ధనలక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. కాబట్టి తాబేలు ఉంగరాన్ని ఎఫ్పుడు పడితే అప్పుడు ధరించకూడదు. తాబేలు ఉంగరాన్ని ధరిస్తే…సంపదకు మార్గం అని చాలా మంది నమ్ముతుంటారు. పురాణాల ప్రకారం…తాబేలు విష్ణువు మూర్తి కూర్మవతారంగా చెబుతుంటారు. లక్ష్మీదేవికి సముద్ర మథనం సమయంలో కనిపిస్తుంది. అందుకే చాలా తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

చాలామందికి తాబేలు ఉంగరాన్ని ఎలా ధరించాలో అవగాహణ ఉండదు. ఇష్టం వచ్చినట్లుగా ధరిస్తుంటారు. తాబేలు ఉంగరాన్ని ధరించడానికి పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం.

1. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. చుట్టూ సానుకూలా శక్తిని సృష్టిస్తుంది. తాబేలు లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఇంట్లో సంపద,ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతుంటారు.

2. తాబేలు ఉంగరాన్ని ధరించే ఏ వ్యక్తి అయినా సరే…తన జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను, సంపదను పొందుతాడని నమ్ముతుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు తాబేలు శాంతి, సహనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ ఉంగరాన్ని ధరించిన వ్యక్తి శాంతి సహనంతో ఉంటాడు.

తాబేలు ఉంగరాన్ని ఎలా ధరించాలి.?
1. బంగారు తాబేలు కంటే వెండితో తయారు చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ ఉంగరాన్ని కుడిచేతికి వేళ్లకు మాత్రమే ధరించాలి. ఎడమ చేతికి ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. ఒకవేళ ధరించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

2. ఈ ఉంగరాన్ని కుడిచేతి చూపుడు వేలు లేదంటే మధ్య వేలుకు మాత్రమే ధరించాలి. ఉంగరం ధరించేటప్పుడు దాని తల మీకు ఎదురుగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా అయితే ఎక్కువ డబ్బును ఆకర్షిస్తుంది. తాబేలు ముఖం బయటకు ఉన్నట్లయితే డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.

తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు ఇవి తప్పనిసరి..!!
ఈ ఉంగరాన్ని ధరించే ముందు దానిని పచ్చిపాలలో ముంచి …గంగాజలంతో శుభ్రం చేయాలి. తర్వాత లక్మీదేవి ముందు ఉంచాలి. లక్ష్మీదేవిని పూజించి…శ్రీ మహాలక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేసిన తర్వాత ఈ ఉంగరాన్ని ధరించాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో తప్పకుండా ఐశ్వర్యం లభిస్తుంది.