Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలంటుంటారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. ప్రతిరోజూ మహిళలు ఇలా చేస్తే ఇంట్లో నుంచి పేదరికం పలాయనం చిత్తగించడం ఖాయం.   * సూర్యోదయం అవ్వకముందే స్త్రీలు ఇంటిని పరిశుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన […]

Published By: HashtagU Telugu Desk
If you want your home to become an abode of Goddess Lakshmi... women should do the following

If you want your home to become an abode of Goddess Lakshmi... women should do the following

ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలంటుంటారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. ప్రతిరోజూ మహిళలు ఇలా చేస్తే ఇంట్లో నుంచి పేదరికం పలాయనం చిత్తగించడం ఖాయం.

 

* సూర్యోదయం అవ్వకముందే స్త్రీలు ఇంటిని పరిశుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది.

* స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలంటే, సూర్యోదయానికి ముందే ఆ పని చేయాలి. సూర్యోదయం తరువాత శుభ్రం చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది.

* ఇంటిని శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో పేదరికంతోపాటు ఒంటికి బాధలు తప్పవు.

* కుటుంబ సభ్యులకు వంట చేయడం అంటే దేవునికి వండటం లాంటిదని అంటారు. అందుకే మహిళలు స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి.

* దైవ ప్రార్థన చేసి.. నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. కడుపునిండా తిని దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

* స్త్రీ ఎప్పుడూ కోపంగా లేదా చిరాకుగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉండదు. అందుకే, స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండటం మంచిది. ఇది ఇంట్లో శాంతి, ప్రశాంతతను తెస్తుంది.

 

ఇంట్లోకి సంపద రావాలంటే…?

* సంధ్యాసమయంలో తల దువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

* ఇంటికి నైరుతి మూలలో నీటి సంపులు వంటి నీటి వనరులను నిర్మించకూడదు. ఇది ఇంట్లో పేదరికం, వేదనకు కారణమవుతుంది.

* మీ నగదు పెట్టె లాకర్‌ను ఇంటి ఉత్తరం వైపు తెరిచి ఉంచాలి. కుబేరుడి చిత్రాన్ని నగదు పెట్టెలో ఉంచితే ఇంట్లో శ్రేయస్సుకు దారితీస్తుందని చాలామంది నమ్ముతుంటారు.

* ఇంట్లో నగదు పెట్టెను ప్రతిబింబించే విధంగా మీ నగదు పెట్టె ముందు అద్దం ఉంచితే… మీ సంపద రెట్టింపు అవుతుంది.

* కొన్ని ఇండోర్ ప్లాంట్లు, మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇది ఇంట్లో సంపద ప్రవాహాన్ని స్థిరీకరించడంతోపాటు పేదరికాన్ని తగ్గిస్తుందని అంటారు.

* ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. ఇంటి మధ్యలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. అయితే, ఒక ఆలయాన్ని మాత్రం నిర్మించవచ్చు.

 

  Last Updated: 07 May 2026, 04:26 PM IST