Goddess Lakshmi: చాణక్య నీతి: ఈ నాలుగు తప్పులు చేశారంటే డబ్బు నిలబడదు!

చాణక్య నీతి గురించి మనందరికీ తెలిసిందే. అప్పటి గొప్ప పండితుల్లో ఒకరైన ఆచార్య చాణక్య జీవితంలో జరిగే

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 01:07 PM IST

చాణక్య నీతి గురించి మనందరికీ తెలిసిందే. అప్పటి గొప్ప పండితుల్లో ఒకరైన ఆచార్య చాణక్య జీవితంలో జరిగే సంఘటన గురించి అనుభవాల గురించి చాణుక్యనీతి లో పేర్కొన్నారు. ఇక ఇందులో జీవితంలోని వివిధ కోణాలను సృజించగా అవి ఇప్పటికీ చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. చాణక్య నీతిలో జీవితంలో జరిగే సంఘటనలతో సంపద, లక్ష్మీ కటాక్షం గురించి కూడా చాణక్యనీతిలో పేర్కొన్నారు. మరి లక్ష్మీ కటాక్షం పొందాలి అంతే ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలి అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి.

లక్ష్మీదేవికి శుభ్రత గా ఉంటేనే నచ్చుతుంది. అందుకే ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాగే డబ్బును ఉపయోగించి ఎప్పుడు ఎవరికీ హాని తలపెట్టకూడదు. ఒకవేళ డబ్బు ఉంటే ఆ డబ్బు ఎప్పుడూ మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి. అవసరం ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషపడుతుంది. అలా కాకుండా డబ్బును వేరే వాళ్ళ నాశనానికి ఉపయోగిస్తే లక్ష్మీదేవి కోపానికి కారణం అవ్వడమే కాకుండా దారిద్యం చుట్టూ ముడుతుంది. అదేవిధంగా మోసాలు తప్పుడు మార్గాలలో ఎప్పుడు డబ్బులు సంపాదించకూడదు.

ఇలా చేయడం వల్ల డబ్బులు ఎప్పటికీ మీ వద్ద ఉండదు. అలా మోసం చేసి సంపాదించిన డబ్బు ఏదో ఒక విధంగా వెళ్లిపోతాయి. అందుకే ఎప్పుడూ కూడా డబ్బును తప్పుడు మార్గాల్లో సంపాదించకూడదు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఎప్పటికైనా మీతోనే ఉంటుంది. అదేవిధంగా చాలామంది డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు అంటున్నాడు ఆచార్య చాణక్య. డబ్బును పొదుపు చేయాలని సూచిస్తున్నారు. అప్పుడప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలా పొదుపు చేసిన డబ్బులే మనకు ఉపయోగపడతాయి.